Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

WhatsApp : మీ వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి, లేదంటే ప్రమాదమే..!

WhatsApp : మీ వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి, లేదంటే ప్రమాదమే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

వాట్సాప్ వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉన్నారు. ప్రతి చిన్న సమాచారం, ఫోటోలు, వీడియోలు షేర్ చేయడానికి అతి ముఖ్యమైన యాప్ గా వాట్సప్ ఉంది. సోషల్ మీడియాలో ఎక్కువమంది వినియోగించే వాట్సాప్ యాప్ ఇప్పుడు హ్యాకర్ల చేతిలోకి కూడా వెళ్తుంది. అయితే మీ వాట్సాప్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా..? ఒకసారి పరిశీలిద్దాం… అంతేకాకుండా హ్యాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం కూడా చూద్దాం..

మీ వాట్సాప్ లో మీరు యాడ్ చేయని కొత్త వ్యక్తులు కూడా మీకు కనిపిస్తున్నట్లయితే వాట్సాప్ యాప్ ను మరొకరు ఉపయోగిస్తున్నారు అనే సంగీతం తెలుస్తుంది. మీకు వారు పరిచయం కోసం సందేశం పంపిస్తే అలాంటి వాటికి స్పందించకూడదు. మీరు చాలా సార్లు ప్రయత్నించినా మీ వాట్సాప్ ను తెరవలేకపోతున్నట్లయితే అలాంటి సమయంలో కూడా ఎవరో హ్యాక్ చేసినట్లుగా తెలుస్తుంది.

వాట్స్అప్ ఖాతా లాక్ చేయబడితే హ్యకర్ ఉపయోగిస్తున్నారని సంకేతం. అంతే కాకుండా మీరు వాట్సాప్ లో వెరిఫికేషన్ కోడ్ లను పదేపదే చూసినట్లయితే మీ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని అర్థం అవుతుంది. వాట్సప్ ఎకౌంటు లాక్ అయినా వెరిఫికేషన్ కోడ్ కోసం రిక్వెస్ట్ పంపిస్తే హ్యాక్ అయినట్లుగా భావించవచ్చు.

వాట్సప్ సంబంధించిన ఏదైనా సందేశం వస్తే రెండు దశల రిజిస్ట్రేషన్ కోడ్ ధృవీకరణకు పిన్ డిమాండ్ చేయబడితే జాగ్రత్తగా ఉండండి. అలాంటి పరిస్థితులలో లింక్ పై క్లిక్ చేయకుండా ఉండాలి. మీ వాట్సాప్ ను ఎవరు హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. వారు పంపించిన లింకుపై క్లిక్ చేస్తే హ్యాకర్ మీ వాట్సాప్ ను యాక్సెస్ తీసుకుంటారు. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మీ వాట్సాప్ డేటాను సురక్షితంగా ఉంచేందుకు ప్రొఫైల్ ఫోటోను చూడడానికి కేవలం మీ పరిచయస్తులకు మాత్రమే అనుమతి ఇవ్వండి. సెట్టింగ్స్ లోకి వెళ్లి ఎకౌంట్స్ పై క్లిక్ చేసి ప్రైవసీ కి వెళ్లి ప్రొఫైల్ ఫోటో లోకి వెళ్లి మై కాంటాక్ట్స్ పై క్లిక్ చేయండి. అంతేకాకుండా వాట్సాప్ లో డబ్బులు అడిగే సందేశాలను నివారించండి. ఎవరైనా డబ్బులు అడిగితే నెంబర్లు రెండు, మూడు సార్లు పరిశీలించండి. ఆ నెంబర్ సరైనదా..? ఫేక్ నెంబర్ అనేది కూడా చూసుకోండి.

MOST READ : 

మరిన్ని వార్తలు