Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ లో అద్దంకి - నార్కట్ పల్లి బైపాస్ వద్ద ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

Miryalaguda : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ లో అద్దంకి – నార్కట్ పల్లి బైపాస్ వద్ద ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న సిమెంటు ట్యాంకర్ ను డీసీఎం ఢీ కొట్టింది.
హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గ్రానైట్ డిసిఎం వాహనం ఢీకొనడంతో మూలమలుపు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. డీసీఎం వాహనం వెనుక వైపు ఉన్న ముగ్గురు కూలీలు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతి చెందిన కూలీలు సూరజ్, బీరు, సంతోష్ ఉన్నట్లు గుర్తించారు. గాయాలైన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ
-
Narayanpet-Kodangal lift Irrigation : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం పై ముగిసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ..!
-
Miryalaguda : NH 167 విస్తరణకు గడువు ముగిసినా ఖాళీ చేయని ఇళ్ల యజమానులు.. సబ్ కలెక్టర్ నోటీసులు..!
-
TG News : ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!
-
Suryapet : సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు, జాగీరు కాదు.. రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి..!









