Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District Collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. విద్యార్థినీలతో కలిసి భోజనం..! 

విద్యార్థులు పరీక్షల సమయంలో భయపడకుండ ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు . గురువారం ఆయన తిప్పర్తి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. విద్యార్థినీలతో కలిసి భోజనం..! 

నల్లగొండ, మన సాక్షి

విద్యార్థులు పరీక్షల సమయంలో భయపడకుండ ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు . గురువారం ఆయన తిప్పర్తి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పదో తరగతి విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడుతూ వారి చదువు పై ప్రశ్నలు అడిగారు.గత సంవత్సరం జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల విద్యార్థులు పదో తరగతిలో 563 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించిన విషయాన్ని గుర్తుచేసిన కలెక్టర్, ఈసారి 563 కంటే ఎక్కువ మార్కులు ఎంతమంది తెచ్చుకుంటారని? విద్యార్థులను అడిగారు.

మెనూ పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్

దీనికి పది మంది విద్యార్థినులు స్పందిస్తూ తాము 563 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటామని సమాధానం ఇచ్చారు. విద్యార్థుల ధైర్యాన్ని అభినందించిన కలెక్టర్, వారికి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకున్నారు. దీనిపై కలెక్టర్ విద్యార్థినులను ప్రోత్సహిస్తూ పరీక్షల సమయంలో భయపడకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. తరువాత హాస్టల్ సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్, దోమలు ఉన్నాయా, బెంచీలు సరిపోతున్నాయా, మూత్రశాలలు బాగున్నాయా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.

అలాగే హాస్టల్ మెనూలో ఏ వంటలు చేశారో కూడా ప్రశ్నించారు. అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థినులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు. మండల తహసిల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో జానయ్య, ఎంఈఓ నరసింహ నాయక్, ఏవో సన్నీ రాజు, ప్రిన్సిపాల్ కే. రాజరాజేశ్వరి, ఇంజనీరింగ్ ఏఈ జ్యోతి, సంబంధిత అధికారులు. కలెక్టర్ వెంట ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు