Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయంతెలంగాణ

Ration Cards : రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త అందింది. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు మూడు నెలల పాటు రేషన్ సరుకులు ఒకేసారి అందించాలని భావిస్తోంది.

Ration Cards : రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త అందింది. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు మూడు నెలల పాటు రేషన్ సరుకులు ఒకేసారి అందించాలని భావిస్తోంది. వర్షా కాలంలో మూడు నెలల రేషన్ ఒకేసారి అందించిన విధంగానే ప్రస్తుతం వేసవి కాలంలో కూడా మూడు నెలల రేషన్ ఒకేసారి అందించాలని కేంద్రం భావిస్తోంది.

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం ఏప్రిల్ మాసంలోనే అందించేందుకు చర్యలు చేపట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌరసరఫరాల శాఖ అధికారులకు లేఖలు రాశారు. మార్చి మొదటి వారంలోని ఎండలు మండిపోతున్నందున ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వేసవిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది.

ALSO READ Fake Company : నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు.. బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్..!

తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంతో మూడు నెలలకు సరిపడా రేషన్ అందించేందుకు ఒక్కొక్కరికి 18 కిలోల సన్నబియ్యం అందించాల్సి ఉంది. మూడు నెలల రేషన్ ముందుగానే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించడం వల్ల సరిపడా నిలువలపై తెలంగాణ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తుంది.

మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడం వల్ల రవాణాచార్జీల ఖర్చు తగ్గడంతో పాటు డీలర్లు, హమాలీలు, కూలీ కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఒక్కో లబ్ధిదారుడు ఒకేసారి మూడు వేలిముద్రలు వేయాల్సి ఉంది. దాంతో ఒక కార్డుదారుడు రేషన్ సరుకులు తీసుకోవడానికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది. కాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏప్రిల్ మాసంలో నెల అంతా సరుకులు అందజేయనున్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు