Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80% డిస్కౌంట్..? హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టత..!

మీ వాహనంపై పెండింగ్ ఛలాన్లు ఉన్నాయా..? అయితే బారీ డిస్కౌంట్ ఉన్నది. మార్చి 14వ తేదీ లోక్ అదాలత్ లో 80 శాతం డిస్కౌంట్ తో క్లియర్ చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80% డిస్కౌంట్..? హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టత..!

మీ వాహనంపై పెండింగ్ ఛలాన్లు ఉన్నాయా..? అయితే బారీ డిస్కౌంట్ ఉన్నది. మార్చి 14వ తేదీ లోక్ అదాలత్ లో 80 శాతం డిస్కౌంట్ తో క్లియర్ చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న వీడియోలపై హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. పోలీసు శాఖ నుంచి ఎలాంటి డిస్కౌంట్ ప్రకటించలేదని, అదంతా ఫేక్ వీడియో అని.. వ్యూస్ కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఫేక్ న్యూస్ అలర్ట్ :

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైక్స్ కోసం కొందరు కక్కుర్తి పడి దిగజారుతున్నారు. మార్చి 14వ తేదీన లోక్అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలానా పై రాయితీ అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలకు ఆశ్చర్యం ఏంటంటే లక్షల్లో వ్యూస్ రావడం. ఇది పూర్తిగా అవాస్తవం. పోలీస్ శాఖ అధికారికంగా ఎలాంటి రాయితీలను ప్రకటించలేదు. ఇలాంటి వీడియోలను నమ్మకండి. ఇతరులకు షేర్ చేయకండి.

సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే ఈ వీడియోస్ చూసిన వారు కూడా తప్పుడు సమాచారం అందించే వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని ప్రజలను తప్పుదోవ పట్టించడం కూడా సరైనది కాదంటూ నెటిజన్లు పేర్కొకుంటున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు