Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

నల్గొండ జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య..!

సాగు చేసిన పంట చేతికందక, పెరిగిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని తెరాటిగూడెంలో చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య..!

సాగు చేసిన పంట చేతికందక, పెరిగిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని తెరాటిగూడెంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన కన్నెబోయిన గోవింద్ (55) కు స్వతహాగా మూడు ఎకరాల భూమి ఉంది. దీనికి తోడు మరో 7 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని, గత ఏడాది మొత్తం 10 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు.

అయితే, ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు సుమారు ₹8 లక్షలకు చేరుకున్నాయి.చేయూతనిచ్చే దిక్కులేక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన గోవింద్, ఫిబ్రవరి 26న తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.మృతుడికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. మృతుని తమ్ముడు కన్నెబోయిన రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అన్నదాత మరణంతో తెరాటిగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

గుర్రంపోడు, మన సాక్షి

MOST READ : 

మరిన్ని వార్తలు