Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Fake Company : నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు.. బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్..!

నకిలీ వ్యాపార సంస్థల పేర్లతో మ్యూల్ బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ మోసాలకు సహకరిస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో జూబ్లీహిల్స్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు చెందిన బ్రాంచ్ మేనేజర్, సేల్స్ మేనేజర్ కూడా ఉన్నారు.

Fake Company : నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు.. బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్..!

శేరిలింగంపల్లి, మన సాక్షి:

నకిలీ వ్యాపార సంస్థల పేర్లతో మ్యూల్ బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ మోసాలకు సహకరిస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో జూబ్లీహిల్స్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు చెందిన బ్రాంచ్ మేనేజర్, సేల్స్ మేనేజర్ కూడా ఉన్నారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ టి. సాయి మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.పహాడీ షరీఫ్‌కు చెందిన జవ్వాద్ ఖాద్రీ రిఫాయి, మహమ్మద్ నౌషాద్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను సమకూర్చేందుకు పథకం పన్నారు.

ఇందులో భాగంగా ఒక షట్టర్‌ను అద్దెకు తీసుకుని, ‘స్టార్ అగ్రో ఇండస్ట్రీస్’ పేరుతో నకిలీ అద్దె ఒప్పందాలు, తప్పుడు వ్యాపార పత్రాలను సృష్టించారు. నకిలీ పత్రాల ఆధారంగా జూబ్లీహిల్స్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేల్స్ మేనేజర్ పాముల ప్రణవరాజ్, బ్రాంచ్ మేనేజర్ శంకర్ రాథీ సహకారంతో కరెంట్ ఖాతా ప్రారంభించారని తెలిపారు.

ఖాతా తెరిచిన వెంటనే దానికి సంబంధించిన ఏటీఎం కార్డు, చెక్ బుక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలతో పాటు సిమ్ కార్డును కూడా సైబర్ మోసగాళ్లకు అప్పగించారన్నారు. దర్యాప్తులో భాగంగా అక్టోబర్ 2025లో ఈ ఖాతా ద్వారా సుమారు రూ. 6.67 లక్షల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. నిందితులు పరారీలో ఉండగా, ఫిబ్రవరి 26, 2026న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

సైబర్ క్రైమ్స్ పోలీసు విచారణలో.. సదరు బ్యాంకు శాఖలోనే దాదాపు 30కి పైగా మ్యూల్ ఖాతాలు తెరిచినట్లు నిందితులు అంగీకరించారన్నారు. ఈ ముఠా వెనుక ఉన్న ఇతర సభ్యులను, బాధితుల వివరాల కోసం దర్యాప్తు చేస్తామన్నారు. డబ్బు కోసం బ్యాంక్ ఖాతాలు, కేవైసీ పత్రాలను ఇతరులకు ఇవ్వడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. బ్యాంకు సిబ్బంది నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు లేదా సైబరక్రైమ్ .గోవిందా .ఇన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు