JAGITYAL : వాగులో యువకుడు గల్లంతు.. కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి..!
JAGITYAL : వాగులో యువకుడు గల్లంతు.. కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి..!
జగిత్యాల, (మన సాక్షి) :
మెట్ పల్లి మాజీ జడ్పిటిసి పెద్దాపూర్ గ్రామానికి చెందిన రాధా శ్రీనివాస్ రెడ్డిల కుమారుడు శ్రీకర్ బుధవారం వినాయకున్ని తరలించే క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రమాదం నుండి బయటపడగా, శ్రీకర్ గల్లంతయ్యాడు.
వాగులో గల్లంతైన కుమారుడి ఆచూకీ కోసం కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులను గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి,కోరుట్ల నిజయోకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు లు మాజీ జడ్పిటిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
శ్రీకర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో నీటి ప్రవాహాన్ని తగ్గించాలని సంబంధిత శాఖ అధికారులకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూచించారు. నీటి ప్రవాహం తగ్గడంతో శ్రీకర్ ఆచూకీ కోసం వరద కాలువలో ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
MOST READ :









