Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : వాగు ఉధృతి.. రాకపోకలకు అంతరాయం..!

Miryalaguda : వాగు ఉధృతి.. రాకపోకలకు అంతరాయం..!

మిర్యాలగూడ /వేములపల్లి, మన సాక్షి:

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువుల,కుంటలు ఉప్పొంగుతున్నాయి. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని బుధవారం రాత్రి ఆయా గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

వర్ష ప్రభావంతో పంట పొలాలు నీట మునిగాయి. ఆయా గ్రామాల చెరువులు నిండుకుండలా మారాయి. మండలంలోని లక్ష్మీదేవి గూడెం సమీపంలోనే బొందం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.దీంతో రాకపోకలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది.

ఓ వాహనదారుడు వాగు దాటుతుండగా మధ్యలో నీటి ప్రవాహంతో గుంతలు కనిపించకపోవడంతో మహిళా ఒక్కసారిగా బైక్ పై నుంచి కింద పడింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం స్థంభవించలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

MOST READ : 

  1. Nacharam : ముంబై నుండి తెప్పించిన సిద్ధి వినాయకుడి విగ్రహం.. ఘనంగా పూజలు..!

  2. Exams : భారీ వర్షాల కారణంగా ఆ పరీక్షలు వాయిదా..!

  3. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. తిప్పర్తి ఘటన కేసులో 50 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా..!

  4. NMDC : హైదరాబాద్ మారథాన్ 2025కు అధికారిక భాగస్వామిగా తమ మారథాన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించిన ఏసిక్స్..!

మరిన్ని వార్తలు