ACB : ఏసీబీ అధికారుల మెరుపుదాడులు.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అధికారి..!
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ తహశిల్ధార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు.

ACB : ఏసీబీ అధికారుల మెరుపుదాడులు.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అధికారి..!
కుత్బుల్లాపూర్, మన సాక్షి:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ తహశిల్ధార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. కుటుంబ సభ్యుల సిర్టిఫికేట్ ( ఫ్యామిలీ మెంబెర్స్ సిర్టిఫికెట్ ) జారిచేసేందుకు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గణేష్ 20,000 లంచం డిమాండ్ చేసారు. భాధితుడు 20,000 ఇవ్వడానికి ఒప్పుకుని గతంలోనే 5,000 ఇచ్చాడు. ఒప్పందం ప్రకారం మిగిలిన 15000 సోమవారం ఇస్తుండగా సిటీ రేంజ్ -1 అధికారులు గణేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
నిందితుని నుండి 15000 రూపాయలు స్వాదీనము చేసుకుని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్ట్ లో హాజరు పరిచారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్చందంగా దైర్యంతో ముందుకురావాలని ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేసినట్లయితే టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1064 కు గాని, వాట్సాప్ నెంబర్ 9440446106 కు గాని పిర్యాదు చేయాలని అధికారులు తెలియజేసారు.
MOST READ :
- Breaking News : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి, మరో యువకుని మృతి..!
- Miryalaguda : మిర్యాలగూడలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..!
- Paddy : నీరు రాక ఎండిపోతున్న వరి పొలాలు..!
- పశ్చిమాసియాలో యుద్ధం.. తెలంగాణ అప్రమత్తం.. న్యూఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!









