Breaking Newsక్రైంతెలంగాణ

Tragedy : శబరిమల వెళ్లి వస్తుండగా తమిళనాడులో ప్రమాదం. తెలంగాణకు చెందిన దంపతులు మృతి..!

తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో ప్రమాదం సంబంధించినది. శబరిమల వెళ్లి వస్తుండగా తెలంగాణకు చెందిన దంపతులు మృతి చెందారు.

Tragedy : శబరిమల వెళ్లి వస్తుండగా తమిళనాడులో ప్రమాదం. తెలంగాణకు చెందిన దంపతులు మృతి..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో ప్రమాదం సంబంధించినది. శబరిమల వెళ్లి వస్తుండగా తెలంగాణకు చెందిన దంపతులు మృతి చెందారు. వారు అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంబంధించినది. వివరాల ప్రకారం..

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట కు చెందిన పాలకుర్తి సత్యనారాయణ (63), రమాదేవి (59) జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. వారు అయ్యప్ప మాల ధరించి జనవరి 8వ తేదీన శబరిమల దర్శనానికి వెళ్లారు. జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప జ్యోతి దర్శనం చేసుకుని తిరిగి బయలుదేరారు.

కాగా కన్యాకుమారి సమీపంలో బైపాస్ లో బస్సు ఆపి అక్కడ సముద్ర స్నానం చేసుకొని దేవాలయాలు సందర్శించుకుని తిరిగి బస్సు వద్దకు వస్తుండగా ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు దంపతులు మృతి చెందారు. వారిని కన్యాకుమారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ 

  1. పండుగ పూట విషాదం.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..!

  2. Post Office : లక్షకు రెండు లక్షలు.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీం, కేంద్రం మద్దతు గ్యారెంటీ రిటర్న్స్..!

  3. Post Office : లక్షకు రెండు లక్షలు.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీం, కేంద్రం మద్దతు గ్యారెంటీ రిటర్న్స్..!

  4. Big Alert : హైదరాబాద్ వెళ్లే వాహనాల దారి మళ్లింపు.. ట్రాఫిక్ రద్దీ తో ప్రత్యామ్నాయ మార్గాలు..!

మరిన్ని వార్తలు