క్రైంBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Accident : తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. ఢీకొన్న బస్సు, జీపు..!

Accident : తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. ఢీకొన్న బస్సు, జీపు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

తెలంగాణ – కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ఏక్లాస్ పూర్ గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం కర్ణాటక బస్సు జీప్ ను ఢీకొన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బస్సు… జీపు ప్రమాదంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని కుమ్మరి వాడకు చెందిన శిరీష(10), కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా గురుమిట్కల్ తాలూకా సీపురం కు చెందిన భీమరాయ అనంతమ్మ ( 50) మృతి చెందారు.

నారాయణపేట నుంచి కర్ణాటక గురుమిట్కల్ వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు గాజర్ కోట్రికే నుండి సుమారు 6 మంది ప్రయాణికులతో నారాయణపేట వైపుకు వస్తున్న జీపు మలుపు వద్ద ఢీకొనడంతో జీపులో ఉన్న శిరీష, అనంతమ్మ మృత్యువాత పడ్డారు.

సమాచారం అందుకున్న నారాయణపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని గల కారణాలపై విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా జనరల్ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.

ఇట్టి ప్రమాదంలో ఉషన్న(36) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

MOST READ : 

  1. Health : ఆరోగ్యంగా ఉన్న వారిలో సగం మందికి గుండెపోటు ముప్పు.. నివారించుకోవచ్చా తెలుసుకుందాం..!

  2. Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య.. మంచి పునాదికి ఉపాధ్యాయులే కీలకం..!

  4. TG News : తెలంగాణలో కొత్త పథకం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!

మరిన్ని వార్తలు