Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

TG News : తెలంగాణలో కొత్త పథకం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!

TG News : తెలంగాణలో కొత్త పథకం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేసే ఈ కొత్త పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత కాలంలో కానిపెంచిన తల్లిదండ్రులను కొంతమంది పిల్లలు గాలికి వదిలేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్నలను పోషించలేని పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో అనేకచోట్ల వృద్ధులైన తల్లిదండ్రులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి ఆలనా పాలన లేకుండా పోయింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా వృద్ధుల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోంది.

రాష్ట్రవ్యాప్తంగా వృద్ధుల కోసం డేకేర్ సెంటర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక డేకేర్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం 9 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు సమాచారం. కాగా చాలామంది పిల్లలు వారి తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో వృద్ధాప్యంలో వారు రోదిస్తున్నారు.

అలాంటివారి కోసం డే కేర్ సెంటర్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో జిల్లాకు ఒక్కో సెంటర్ ను 33 సెంటలను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ సెంటర్లు ప్రస్తుతం అద్దె భవనాల్లో ప్రారంభించాలని, అనంతరం నూతన భవన నిర్మాణాన్ని కూడా పునాదులు వేసే అవకాశాలు ఉన్నాయి.

క్లిక్ చేసి ఇవి కూడా చదవండి : 

  1. Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Health : ఆరోగ్యంగా ఉన్న వారిలో సగం మందికి గుండెపోటు ముప్పు.. నివారించుకోవచ్చా తెలుసుకుందాం..!

  3. Miryalaguda : రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు..!

  4. Snacks : ఆరోగ్యం, రుచి… సాయంత్రం తినాల్సిన స్నాక్స్ ఇవే..!

  5. Hair Fall : పురుషులకే బట్టతల ఎందుకు.. నివారణకు సూచనలు..!

మరిన్ని వార్తలు