తెలంగాణBreaking Newsకామారెడ్డి జిల్లాజిల్లా వార్తలు

District collector : గడువులోగా సీఎంఆర్ ఇవ్వకుంటే చర్యలు.. జిల్లా కలెక్టర్..!

District collector : గడువులోగా సీఎంఆర్ ఇవ్వకుంటే చర్యలు.. జిల్లా కలెక్టర్..!

కామారెడ్డి, మన సాక్షి :

2023-24 సంవత్సరం రబీ కాలానికి సి.ఏం.ఆర్. త్వరగా సరఫరా చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమావేశం మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వన్ మాట్లాడుతూ, గత సంవత్సరం రబీ కాలానికి సంబంధించిన సి.ఏం.ఆర్. (కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యానికి అనుగుణంగా మిల్లర్లు సరఫరా చేయలేదని, ఈ నెల 25 తేది లోగా నిర్ణయించిన కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సరఫరా చేయని పక్షంలో సదరు రైస్ మిల్లుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

అధికారులు ఆయా రైస్ మిల్లులను తనిఖీ చేసి స్టాక్ లను పరిశీలించాలని తెలిపారు. సి.ఏం.ఆర్. త్వరితగతిన సరఫరా చేయాలని అన్నారు. గత ఖరీఫ్ లో సి.ఏం.ఆర్. సరఫరాలపై కలెక్టర్ వాకబు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయించిన తేదీ లోగా సి.ఏం.ఆర్. సరఫరా చేయని మిల్లర్లకు నోటీసులు జరీచేయడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు మిల్లర్లు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, మిల్లర్లు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు