SBI : డిగ్రీ అర్హతతో SBIలో భారీగా ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ, వేతనం రూ.50వేలు..!
SBI : డిగ్రీ అర్హతతో SBIలో భారీగా ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ, వేతనం రూ.50వేలు..!
మన సాక్షి, వెబ్ సైట్..!
SBI లో భారీ సంఖ్యలో జూనియర్ అసోసియేట్స్ ఖాళీలను భర్తీ చేయబోతుంది. దేశవ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా 13,735 ఖాళీలు ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలంగాణలో 342, ఏపీలో 50 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో ఆంగ్లంతో పాటు తెలుగు, హిందీ, ఉర్దూ భాషలో ఎస్బిఐ నియామక పరీక్ష రాసుకునే అవకాశం కూడా ఉంది.
ఎస్బిఐలో జూనియర్ అసోసియేట్ గా ఎంపికైన అభ్యర్థులకు 26,730 రూపాయల మూల వేతనంతో నెల వేతనం ప్రారంభమవుతుంది. అలవెన్స్ లతో కలిపి ముంబై లాంటి ప్రదేశాల్లో 46వేలతో ప్రారంభమవుతుంది. ఇవి కాకుండా మెడికల్, పిఎఫ్, లీవ్ ఫెయిర్, పెన్షన్ సదుపాయం కూడా ఉంది.
విద్యార్హతలు :
2024 డిసెంబర్ 31వ తేదీ నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 20 నుంచి 28 సంవత్సరాల వరకు వయసు కలిగి ఉండాలి. 750 రూపాయలు దరఖాస్తుకు. చివరి తేదీ 2025 జనవరి 7.
ఆన్ లైన్ లో పరీక్షలు రెండు దశల్లో నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ప్రిలిమ్స్ పరీక్ష ఫిబ్రవరి లో ఉంటుంది. మెయిన్స్ పరీక్ష మార్చి లేదా ఏప్రిల్ లో ఉంటుంది. మరిన్ని వివరాలకు www.Sbi.co.in చూడండి.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!
-
మహిళ సంఘాల డబ్బు స్వాహా చేసిన మినీ బ్యాంకు నిర్వాహకులు.. మహిళల ధర్నా..!
-
Indiramma Bharosa : భూమిలేని రైతు కూలీలకు రూ.12 వేలు.. పంపిణీ ఎలా.. మీరు అర్హులేనా..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తులు చేసుకోవాలా.. మీరు అర్హులేనా..!









