Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మహిళ సంఘాల డబ్బు స్వాహా చేసిన మినీ బ్యాంకు నిర్వాహకులు.. మహిళల ధర్నా..!

మహిళ సంఘాల డబ్బు స్వాహా చేసిన మినీ బ్యాంకు నిర్వాహకులు.. మహిళల ధర్నా..!

దేవరకొండ, మనసాక్షి :

మహిళా సంఘాలు చెల్లించిన డబ్బులను బ్యాంక్ లో జమ చేయకుండా వారి సొంతానికి వాడుకొని గోల్మాల్ చేసిన మిని బ్యాంక్ నిర్వాహకులు కుంభం మహేష్ తిమ్మాపురం వ్యక్తి నుంచి డబ్బు రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు నల్గొండ జిల్లా దేవరకొండ యూనియన్ బ్యాంకు ఎదుట సోమవారం ధర్నాకు దిగారు.

పూర్తి వివరాలలోకి వెళితే నేరేడుగోమ్ము మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన యూనియన్ మినీ బ్యాంకు(కస్టమర్ పాయింట్) నిర్వాహకులు కుంభం మహేష్ మహిళా సంఘాలు మరియు కొంత మంది రైతులు చెల్లించిన డబ్బును బ్యాంక్ లో కట్టకుండా తన సొంత కి వాడుకొని మోసం చేశారని గ్రామ మహిళా సంఘాల సభ్యులు సోమవారం యూనియన్ బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. మహిళా సంఘాల సొమ్ము మరియు రైతుల సొమ్ము సుమారు 6 లక్షల పైచిలుకు రూపాయలతో మోసం చేశారని పేర్కొన్నారు.

బ్యాంకు మేనేజర్ వివరణ:

దీనికి సంబంధించి యూనియన్ బ్యాంక్ మేనేజర్ అరుణ్ కుమార్ ను వివరణ అడగగా మహిళా సంఘాల డబ్బులను జమ చేయకుండా కాజేసిన విషయం వాస్తవమేమని, మహేష్ కుంభం కస్టమర్ సర్వీస్ పాయింట్ను తొలగిస్తున్నట్టు అదేవిధంగా మహిళా సంఘాల నుంచి జమ చేయకుండా తీసుకున్న డబ్బును వడ్డీతో సహా రికవరీ చేస్తామన్నట్టుగా వారు తెలిపారు.

MOST READ :

మరిన్ని వార్తలు