District collector : ప్రతి పాఠశాలలో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : ప్రతి పాఠశాలలో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసి పిల్లలకు పెట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎంఈఓ లతో మధ్యాహ్న భోజన పథకంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఈవోలు మధ్యాహ్న భోజనాన్ని ఎలా తనిఖీ చేస్తున్నారని ప్రశ్నించారు. పాత స్టాక్ మార్చి కొత్త స్టాక్ ఏర్పాటు చేశామని ఎంఈవోలు కలెక్టర్ కు తెలిపారు. 100% బియ్యం మార్చినట్లు రిపోర్ట్ ఇవ్వాలని డీఈవోను ఆదేశించారు. బియ్యం సంచులను ఎత్తు ప్రదేశంలో పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఏజెన్సీలు సిలిండర్లపై వండుతున్నారా లేదా అని ఆరా తీశారు.
ఏజెన్సీ వారికి కిట్స్ క్యాప్స్ గ్లోవ్స్ మాస్కులు పెట్టుకోవాలని తెలిపారు. త్రాగునీటి సరఫరా ఎలా ఉందని మిషన్ భగీరథ నీళ్లు వాడుతున్నారా లేదా అని తెలుసుకున్నారు. తాగునీటి వసతిలేని పాఠశాలలకు నేటి వసతి ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలకు వంటలలో సన్ఫ్లవర్ నూనె వాడాలన్నారు.
అలా వాడని పాఠశాలల హెడ్మాస్టర్లకు మెమొలు ఇవ్వాలని సూచించారు. పదవ తరగతి పై సమీక్షిస్తూ ప్రత్యేక క్లాసులు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎఫ్ ఎల్ ఎన్ డాటా పై సమీక్షించారు. సిలబస్ అయిపోయిందా లేదా అని అర తీశారు. ఎక్స్ట్రా ఆవర్స్ లో రివిజన్ చేస్తున్నామని ఎంఈఓ లు కలెక్టర్ కు తెలిపారు.
ఎఫ్ ఎల్ ఎన్ పై యాక్షన్ ప్లాన్ చేయాలన్నారు. కొత్త టీచర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. హ్యాండ్ వాష్, శానిటేషన్ పై ఆరా తీశారు. హైజిన్ క్యాంపెయిన్ నిర్వహించాలని తాజా కూరగాయలు రోజు ఖరీదు చేయాలన్నారు. కోడిగుడ్లు పెద్దగా ఉండేలా చూసుకోవాలన్నారు.
ఫుడ్ సేఫ్టీ కమిటీ అన్ని స్కూల్లో ఉండాలని కమిటీ లేని స్కూల్లో చార్జి మెమో ఇవ్వాలని ఆదేశించారు. టేస్ట రిజిస్టర్ పెట్టాలని కంప్లైంట్ బాక్స్ స్టాక్ రిజిస్టర్ పెట్టాలన్నారు. కిచెన్ షెడ్ పై సమీక్షించి ఎంఈఓలకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డీఈవో గోవిందరాజులు, ఎంఈఓ లు, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా.. పంట పొలాల్లో శాటిలైట్ సర్వే..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!
-
Indiramma Bharosa : భూమిలేని రైతు కూలీలకు రూ.12 వేలు.. పంపిణీ ఎలా.. మీరు అర్హులేనా..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. అర్హతలు ఇవే.. మీరు అర్హులేనా..!









