Alumni : దశాబ్ద కాలం తర్వాత.. మళ్ళీ అదే పాఠశాల ముంగిట..!
పదేళ్ల నాటి తీపి జ్ఞాపకాలు.. చిన్ననాటి స్నేహితుల పలకరింపులతో పాల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం ఆదివారం మురిసిపోయింది.

Alumni : దశాబ్ద కాలం తర్వాత.. మళ్ళీ అదే పాఠశాల ముంగిట..!
గుర్రంపోడు, మన సాక్షి :
పదేళ్ల నాటి తీపి జ్ఞాపకాలు.. చిన్ననాటి స్నేహితుల పలకరింపులతో పాల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం ఆదివారం మురిసిపోయింది. 2015-16 విద్యా సంవత్సరం పదవ తరగతికి చెందిన పూర్వ విద్యార్థులు దశాబ్దం తర్వాత ఒకే వేదికపైకి చేరి ‘ఆత్మీయ సమ్మేళనాన్ని’ అత్యంత వేడుకగా నిర్వహించుకున్నారు.
తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల పట్ల విద్యార్థులు తమ కృతజ్ఞతను చాటుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలితో పాటు, ఉపాధ్యాయురాలు విజయలక్ష్మిని ఇతర గురువులను విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించి, పాదాభివందనం చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. “పదేళ్ల తర్వాత కూడా విద్యార్థులు తమను గుర్తుంచుకుని, ఇంతటి గౌరవాన్ని అందించడం ఎంతో గర్వంగా ఉందని” భావోద్వేగానికి లోనయ్యారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు వెంకటరామిరెడ్డి, యాదగిరి, శ్యాం ప్రసాద్, చంద్రమౌళి, పద్మలత, పుష్పలత, శ్వాసిక ,సైదులు తమ పాఠశాల రోజులను నెమరువేసుకున్నారు.
క్లాస్ రూమ్ లో చేసిన అల్లరిని, ఆటపాటలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన తామంతా మళ్లీ ఒకే చోట కలవడం మరువలేని అనుభూతిని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులందరూ కలిసి సహపంక్తి భోజనం చేసి, ఫోటోలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.
MOST READ
-
వేపచెట్టు కొమ్మల నుంచి బుసబుస శబ్దం.. తీరా చూస్తే విచిత్ర దృశ్యం..!
-
TG News : తెలంగాణ లో భారీగా IPS ల బదిలీలు..!
-
BIG BREAKING : ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తుండగా కారు ప్రమాదం.. ప్రధానోపాధ్యాయురాలు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!
-
MEO : మండల విద్యాధికారిగా మంజూష రాణి.. ఎవరో తెలుసా..!
-
పండుగ పూట విషాదం.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..!









