Rythu Bharosa : రైతు భరోసా కు మళ్లీ దరఖాస్తులు.. ఎప్పటినుంచంటే..!
Rythu Bharosa : రైతు భరోసా కు మళ్లీ దరఖాస్తులు.. ఎప్పటినుంచంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగ నుంచి రైతు ఖాతాలలో డబ్బులను జమ చేయనున్నారు. అందుకుగాను గురువారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు భేటీ అయ్యారు.
రైతు భరోసా పథకం కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. రైతుల నుంచి జనవరి 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఫీల్డ్ సర్వే నిర్వహిస్తారు.
అదేవిధంగా శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాగు చేసిన భూములను గుర్తిస్తారు. అన్ని కరెక్ట్ గా ఉన్న రైతులకు జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు తెలిసింది.
సాగులో లేని భూములకు రైతు భరోసాను నిలిపివేయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.53 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా సాగులో 1.30 కోట్ల ఎకరాల భూమి ఉంది. సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా పథకం అందించేందుకు గాను ప్రభుత్వం వ్యవసాయ అధికారులచే ఫీల్డ్ సర్వే తో పాటు శాటిలైట్ సర్వేను నిర్వహించనున్నారు.
దాంతో అక్రమాలు, అవకతవకలు జరగకుండా నిజమైన రైతులకు రైతు భరోసా పెట్టుబడి సహాయం అందేఅవకాశాలు ఉన్నాయని నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈనెల 4వ తేదీన మంత్రిమండలి మరోసారి సమావేశమై విధి విధానాలు నిర్ణయించే అవకాశాలున్నాయి.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోస పై కీలక నిర్ణయం.. మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Good News : రైతులకు మోడీ భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో రూ.10వేలు..!
-
Miryalaguda : మన సాక్షి పత్రికకు పెరిగిన ఆదరణ.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!
-
Gold Price : కొత్త సంవత్సరంలో వరుస షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర..!









