Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!

Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రైతులకు ఇక పండుగ కానున్నది. అన్ని రంగాల్లో మాదిరిగానే వ్యవసాయ రంగంలో కూడా AI టెక్నాలజీ రాబోతుంది. దాంతో పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ రానున్నది. సాంకేతిక టెక్నాలజీ సహాయంతో వ్యవసాయ రంగం దూసుకుపోనున్నది. అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించేందుకు చర్యలు చేపట్టింది.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు వ్యవసాయం ఆధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాలు, AI ని భారీగా ఉపయోగించాలని కోరుకుంటుంది. అందుకోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివిధ కంపెనీలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. కంపెనీ ప్రతినిధులు రైతులకు కావలసిన కొత్త యంత్రాలు, ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు.
తెలంగాణ వ్యవసాయ రంగంలో మరో అడుగు ముందుకు వేసి త్వరలోనే మహిళా రైతులకు డ్రోన్లు ఇచ్చేలా ఓ పథకం సిద్ధం చేయబోతుంది. మొట్ట మొదటి సారిగా 381 డోన్లు పంపిణీ చేయనున్నారు.
ఏఐ గొప్ప విప్లవం :
వ్యవసాయ రంగంలో ఏఐ టెక్నాలజీని తీసుకురావడంతో గొప్ప విప్లవం ప్రారంభం కానున్నది. రైతుల అవసరాలకు తగినట్టుగా యంత్రాలను ప్రభుత్వం సిద్ధం చేయడంతో పాటు ఏఐ టెక్నాలజీని తీసుకురావడం వల్ల రైతు తన పొలంలో ఇంటి దగ్గర నుంచి పంపును ఆన్.. ఆఫ్ చేయవచ్చును. దాంతో పాటు సోలార్ పవర్ ద్వారా కరెంటును ఉత్పత్తి చేసుకోవచ్చును.
ఇలాంటి టెక్నాలజీలతో పాటు పంటలపై వచ్చే చీడపీడలను మొబైల్ కెమెరా ద్వారా స్కాన్ చేసి గుర్తించే సాంకేతికను తీసుకురానున్నారు. దీనిని నెదర్లాండ్స్ కు చెందిన కంపెనీ ప్రతినిధులతో తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. ఇతర రంగాల మాదిరిగానే వ్యవసాయ రంగంలో కూడా మెరుగైన ఫలితాలను అందించేందుకుగాను AI టెక్నాలజీని తీసుకురానున్నారు.
రైతులకు పంట పెట్టుబడి ఖర్చులు తగ్గించడంతోపాటు ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ మూడు సంవత్సరాల నుంచి ఇలాంటి వాటిపై పరిశోధనలు చేస్తున్నారు. శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూనివర్సిటీలోని పంటల సాగు విస్తీర్ణాన్ని గమనించారు. అగ్రి రోబోటిక్స్ సొల్యూషన్ ఫర్ అగ్రికల్చర్ ల్యాబ్ ను ప్రారంభించారు.
MOST READ :
-
Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రూ.48 వేలు ఒకేసారి.. రైతుభరోసా మీకు రాలేదా.. వెంటనే ఇలా చేయండి..!
-
District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!
-
District collector : పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఆ కేసుల జోలికి వెళ్తే క్రమశిక్షణ చర్యలు..!
-
Devarakonda : సాహసయాత్ర.. బైక్ పై ఆలిండియా చుట్టివచ్చిన యువకుడు..!









