తెలంగాణBreaking Newsనల్గొండ

Miryalaguda : ఐఐటి ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా 29వ ర్యాంక్..!

Miryalaguda : ఐఐటి ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా 29వ ర్యాంక్..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా  మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు బాణవత్ స్కైలాబ్ కుమారుడు బాణవత్ సాయి ఠాగూర్ ఐఐటి ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా 29వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లు వారి ఇంటికి వెళ్లి వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ సాయి ఠాకూర్ సాధించిన ఈ ఘనత మన మిర్యాలగూడకి గర్వకారణం అని ఎంతో మంది యువతకు ఆదర్శం అని అన్నారు. అలాగే అతడి వెన్నంటు ఉండి నడిపించిన వారి కుటుంబ సభ్యులను అభినందించారు. అలాగే వారు ఇంకా ఉన్నత స్థానాలకు చేరాలని వారికి ప్రభుత్వం నుంచి మరియు తమ నుంచి ఎల్లప్పుడూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.

MOST READ :

  1. Miryalaguda : గెస్ట్ లెక్చరర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..!

  2. Penpahad : భూ భారతి సదస్సు రైతులు సద్వినియోగం చేసుకోవాలి..!

  3. Rythu Bharosa : రైతు భరోసా ఇక వారికేనా.. ఇంకెత కాలం.. లేటెస్ట్ అప్డేట్..!

  4. TG News : తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు ఇవే..!

  5. District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. బస్తీ దావఖాన ఆకస్మిక తనిఖీ..! 

మరిన్ని వార్తలు