Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsసూర్యాపేట జిల్లా

Penpahad : భూ భారతి సదస్సు రైతులు సద్వినియోగం చేసుకోవాలి..!

Penpahad : భూ భారతి సదస్సు రైతులు సద్వినియోగం చేసుకోవాలి..!

పెన్ పహాడ్, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని పెన్ పహాడ్ , మల్కాపురం, దుబ్బ తండ గ్రామాలలో మంగళవారం తాసిల్దార్ ధారావత్తు లాలు నాయక్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ ధారావత్తు లాలు నాయక్ మాట్లాడుతూ భూభారతి సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, భూమి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

భూమి సమస్యలను పరిష్కరించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లోని పలువురు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రైతుల నుండి వచ్చిన భూవివాద దరఖాస్తు లు పెన్ పహాడ్ లో 50 మరియు గాజుల మల్కాపురంలో 78 రైతుల నుండి స్వీకరించామని సోమవారం రోజున మొత్తం 128 దరఖాస్తు లు వచ్చాయని దరఖాస్తులను పరిశీలించి పై అధికారుల ఆదేశానుసారము పరిష్కరిస్తామని ఆయన తెలిపినారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రంజిత్ రెడ్డి, ఆర్ఐ ఉన్నిసా బేగం, అజారుద్దీన్, సైదులు, చిన్న వీరస్వామి, వెంకయ్య, తండు శివకుమార్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Suspended : విద్యాశాఖ సంచలన నిర్ణయం.. ఎంఈఓ తో పాటు మరో ఇద్దరు సస్పెండ్..!

  2. TG News : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

  3. Rythu Bharosa : రైతు భరోసా ఇక వారికేనా.. ఇంకెత కాలం.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకం ద్వారా 182 కోట్ల జీరో టిక్కెట్లు.. ఆడపడుచులకు రూ.6088 కోట్ల ఆదా..!

మరిన్ని వార్తలు