Breaking Newsతెలంగాణవైద్యంసినిమాహైదరాబాద్

Allu Arjun : అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట.. మధ్యంతర బెయిల్..!

Allu Arjun : అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట.. మధ్యంతర బెయిల్..!

మన సాక్షి, హైదరాబాద్ :

సినీ నటుడు అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట కలిగింది. హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో శుక్రవారం మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.

దాంతో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇది ఇలా ఉండగా అతనికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. అల్లు అర్జున్ కు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తుంది.

దాంతో పాటు 50 వేల వ్యక్తిగత పూచీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది. కాగా చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ బయటకు రానున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు