ALLU ARJUN : అల్లు అర్జున్ పై వెల్లువెత్తిన నిరసనలు.. ఇంటిపై టమాటాలతో దాడి..!

ALLU ARJUN : అల్లు అర్జున్ పై వెల్లువెత్తిన నిరసనలు.. ఇంటిపై టమాటాలతో దాడి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
సినీ నటుడు అల్లు అర్జున్ పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన విషయంపై అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
అల్లు అర్జున్ సినిమా హాల్ కు రావడం వల్లనే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి మహిళ రేవతి మృతి చెందిందనే విషయం తెలిసిందే. కాగా మహిళ ప్రాణాలు పోవడంలో అల్లు అర్జున్ ఏ మాత్రం పశ్చాతాపం లేదని పేర్కొంటున్నారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మాట్లాడడాన్ని తప్పుపట్టారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ కు పాశ్చాత్తాపం లేదని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పలువురు అల్లు అర్జున్ వ్యవహార శైలిని తప్పుపట్టారు.
ఇది ఇలా ఉండగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. సంధ్యా థియేటర్ వద్ద ఘటనలో మృతి చెందిన మహిళ కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో పోలీసులు పలువురిని అరెస్టు చేయగా, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటిపై టమాటాలతో దాడి చేశారు.
ఇది ఇలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ వ్యవహార శైలిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు సైతం సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై వీడియోను విడుదల చేశారు.
MOST READ :
-
UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల క్లారిటీ.. ఒక్క రైతును కూడా తగ్గించం.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : రైతులకు అదిరిపోయే శుభవార్త.. మరో కొత్త పథకం ప్రారంభం..!
-
Gurukula : గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు..!









