Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsటెక్నాలజీతెలంగాణవైద్యంహైదరాబాద్

UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే..!

UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

మన సాక్షి, వెబ్ డేస్క్:

ప్రస్తుతం ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ కు అలవాటు పడిపోయారు. పది రూపాయల నుంచి వేల రూపాయల వరకు కూడా డిజిటల్ లనే పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే 2025 లో యూపీఐ (UPI) లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులంతా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే…

ఆర్బిఐ ద్రవ్య విధానం 2025 జనవరి నుంచి అమలులోకి రానున్నది. UPI లావాదేవీ పరిమితుల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. జనవరి ఒకటో తేదీ నుంచి యుపిఐ 123 చెల్లింపులు, లావాదేవీల్లో పరిమితిని పెంచారు. గతంలో యూపీఐ చెల్లింపు పరిమితి కేవలం 5000 రూపాయలు ఉండగా దానిని పదివేల రూపాయలకు పెంచారు.

రిజర్వ్ బ్యాంక్ ఈ విధానాన్ని ప్రకటించినప్పటికీ బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు అమలు చేయడానికి గడువు ఇచ్చాయి. అయితే ఈ వ్యవధి డిసెంబర్ 31 తో ముగుస్తుంది. దాంతో జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

అదే విధంగా జనవరి ఒకటో తేదీ నుంచి యూపీఐ లావాదేవీల పరిమితులు మాత్రమే కాకుండా కొన్ని కొత్త నిబంధనలు కూడా అమలులోకి రానున్నాయి. UPI 123 పేమెంట్స్ కు ఎటువంటి సేవా రుసుము విధించరు. అంతే కాకుండా ఇంటర్నెట్ సర్వీస్ లేకుండా రెమిటెన్స్ సర్వీస్ కూడా ఉంటుంది. అంటే ఫీచర్ ఫోన్ల ద్వారా ఐ వి ఆర్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ నెంబర్ ఉపయోగించి డబ్బు లావాదేవీలను చేయవచ్చును. దాంతో మీ ఫోన్ కు ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధానం జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది.

పాన్ కార్డుతో ఆధార్ కార్డు తప్పనిసరిగా లింకు ఉండాలి. ఒకవేళ లేనట్లయితే కార్డు డిజేబుల్ అవుతుంది. ఒకవేళ పాన్ కార్డు డిజేబుల్ అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి సేవలు నిర్వహించడం సాధ్యం కాదు. ఈ రెండు అంశాలను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.

MOST READ : 

మరిన్ని వార్తలు