తెలంగాణBreaking NewsTOP STORIESవ్యవసాయం

తెరుచుకున్న ఆల్మట్టి గేట్లు, భారీగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. ఆయకట్టు రైతుల ఆశలు పదిలం..!

తెరుచుకున్న ఆల్మట్టి గేట్లు, భారీగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. ఆయకట్టు రైతుల ఆశలు పదిలం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

కర్ణాటకలోని కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యాం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో అలర్ట్ అయిన అధికారులు డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్ కు 1.04 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుంది. దాంతో 14 గేట్లు ఎత్తి 65 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

మంగళవారం సాయంత్రానికే వరద నీరు పెరగడంతో ఆల్మట్టి డ్యాం నిండుకుండలా మారింది. ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 129 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీలకు చేరింది. దాంతో 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయంలోకి 65 వేల క్యూసెక్కుల నీరు చేరుతుంది.

నారాయణపూర్ జలాశయం నీటిమట్టం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 28.76 టీఎంసీలు ఉంది. ఈ ఒక్క రోజులోనే నారాయణపూర్ ప్రాజెక్టు కూడా నిండి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. నారాయణపూర్ లో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి శ్రీశైలం కు నీటిని వదలనున్నార

కృష్ణానది పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు 2496 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. కృష్ణా నది ఉపనది అయిన తుంగభద్ర కు కూడా వరద పెరుగుతుంది. తుంగభద్రలో పూర్తిస్థాయి నీటిమట్టం 105.79 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35.40 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర కు కూడా 28 వేల 153 క్యూసెక్కుల నీరు వస్తుంది.

సాగర్ ఆయకట్టు రైతుల ఆశలు పదిలం :

రెండేళ్లుగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ ఎడమ కాలువ రైతుల ఆశలు పదిలంగా ఉన్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల ఎగువ ప్రాజెక్టులు నిండడంతో రైతులు ఆనందంతో ఉన్నారు. ముఖ్యంగా ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరకు ఇన్ ఫ్లో కొనసాగుతుందని రైతులు ఆశల్లో ఉన్నారు.

గత ఏడాది ప్రాజెక్టులలో నీళ్లు లేక సాగర్ ఆయకట్టు పరిధిలో సాగునీటిని విడుదల చేయలేదు. దాంతో భూములన్ని బీళ్లు గానే ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు కురిస్తే పంటలు వేసుకోవచ్చని రైతులు ముందస్తుగా దుక్కులు దున్నుకొని, వరి నార్లు పోసుకొని సిద్ధంగా ఉన్నారు.

కాగా జూలై మాసంలో వరుణుడు కరుణించడంతో కర్ణాటక , మహారాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. దాంతో కృష్ణ పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది. ఇదేవిధంగా వరద కొనసాగితే ఆగస్టులో సాగర్ ప్రాజెక్టు కు కూడా నీరు సమృద్ధిగా చేరే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి : 

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహా అద్భుతం.. పాతాళగంగ వద్ద చంద్ర లింగానికి చుట్టుకుని ఉన్న నాగుపాము.. (వీడియో)

Cm Revanth Reddy : రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ట్వీట్.. లేటెస్ట్ అప్డేట్..!

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం.. ఆల్మట్టికి ఇన్ ఫ్లో, సాగర్ ఆయకట్టులో ఆశలు..!

ఆల్మట్టి నుంచి దిగువకు నీరు.. సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు..!

మరిన్ని వార్తలు