Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Anganwadi : అంగన్వాడి టీచర్ మృతి..!

Anganwadi : అంగన్వాడి టీచర్ మృతి..!

చింతపల్లి. మనసాక్షి.

నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని మోదుగుల మల్లేపల్లి గ్రామానికి చెందిన సీనియర్ అంగన్వాడి టీచర్ వైద్యుల వసంత లక్ష్మి సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. వేరు 1984లో అంగన్వాడి టీచర్ గా మోదుగుల మల్లేపల్లి గ్రామంలో నియామకమయ్య రు.

నాటి నుండి నేటి వరకు గ్రామంలో ఎంతో మంది చిన్నారులను చేరదీసి విద్యాబుద్ధ నేర్పించారు. 40 సంవత్సరాలుగా ఒకే గ్రామంలో ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూ సేవలందిస్తూ అందరి మన్నలను చూరగొన్నారు. వసంతమ్మ అంటే చుట్టుపక్కల గ్రామాల్లో తెలియని వారు ఉండరు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వీరు గ్రామ ప్రజలందరితో కలివిడిగా ఉంటూ ప్రతి ఇంటివారిని మందలిస్తూ ఏ ఇంటిలో కార్యం జరిగిన ఆ ఇంటికి వెళ్లేవారు.

ALSO READ : Guntur karam : గుంటూరుకారం సినిమా విలన్స్ పేర్లలో వివాదం.. ఆందోళనలకు సిద్ధం..!

దీంతో గ్రామంలో ఆమెను పంతులమ్మ అంటూ గ్రామంలోని వారి పిల్లలను ఆమెపై పూర్తి నమ్మకంతో ఆమె వద్దనే వదిలి వెళ్ళేవారు. ఆమె ఎప్పుడు ఏ రోజు కూడా సెలవు తీసుకోకుండా నా అంగన్వాడి పిల్లలు అంటే నాకెంతో ఇష్టం అంటూ వారితోనే జీవనం గడిపింది. గ్రామంలోని ప్రతి ఒక్క చిన్నారి ఆమె చేతులలో పెరిగి పెద్దయిన వారే. వారు నేడు హఠాత్తుగా గుండెపోటుకు మృతి చెందడం చాలా బాధాకరమని ఆ గ్రామ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

వసంత లక్ష్మి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న చింతపల్లి ఐసిడిఎస్ అధికారిని లావణ్య కుమారి, సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు ఆయాలు పలువురు ఆమెను చూసేందుకు తరలివచ్చారు. సంక్రాంతి పండుగ రోజు అయినప్పటికీ గ్రామంలో ఏ ఒక్కరు కూడా ఆమె దహన సంస్కారాలు పూర్తి అయ్యేంతవరకు పండగ జరుపుకో లేదు.

ALSO READ : రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి మరొకరికి తీవ్రయాలు..!

ప్రజలతో ఎంతో మమేకమై ఉన్న ఆ కుటుంబాన్ని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్, పలు పార్టీల ప్రజాప్రతినిధులు తదితరులు వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మర్ల వెంకటయ్య ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారo అందించారు.

మరిన్ని వార్తలు