రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి మరొకరికి తీవ్రయాలు..!

హైదరాబాదు నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు అక్కడక్కడ మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయలను సంఘటన చింతపల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం .

రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి మరొకరికి తీవ్రయాలు..!

చింతపల్లి. మనసాక్షి :

హైదరాబాదు నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు అక్కడక్కడ మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయలను సంఘటన చింతపల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం .

మండల పరిధిలోని కురంపల్లి గ్రామానికి చెందిన దార్ల అరవింద, 22 సంవత్సరాలు పోలోజు రాఘవేందర్ 29 సంవత్సరాలు, దార్ల ప్రభాకర్ లు ఏపీ 29 ఏవి 97 91 నెంబర్ గల వ్యాగన్ఆర్ కార్లో ఆదివారం రాత్రి కురంపల్లి పల్లి గ్రామం నుండి మండల పరిధిలోని మాల్ గ్రామానికి సొంత పనిపై వెళ్లారు.పని ముగించుకొని తిరిగి రెండు గంటల సమయంలో కురంపల్లి గ్రామానికి అదే కారులో తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో పోలేపల్లి రాంనగర్ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి పీర్ల గుట్ట కమాను వద్ద పల్టీ కొట్టింది.

ALSO READ : Good News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఉచితంగా..!

దీంతో కారులో ప్రయాణిస్తున్న దార్ల అరవింద్, పోలోజు రాఘవేందర్ ల కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. దార్ల ప్రభాకరకు స్వల్ప గాయాలు కావడంతో ప్రమాదం నుండి తే రు కొ ని కురంపల్లి లోని బంధువులకు వెంటనే సమాచారాన్ని అందించారు.

సంఘటన విషయం తెలుసుకున్న బంధువులు హటావోటన ప్రమాద స్థలాని కి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడి కొట్టుమిట్టాడుతున్న దార్ల ప్రభాకర్ ను హైదరాబాదులోని మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఇరువురు యువకులు వృత్తి నక్ష పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు.

ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 500లతో నిమిషాల్లోనే..!

ఓకే గ్రామానికి చెందిన ఇరువురు యువకులు మృతి చెందడంతో గ్రామం విషాదంలో మునిగింది. మృతుల కుటుంబ సభ్యులు దార్ల బ్రహ్మచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.