Good News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఉచితంగా..!

తెలంగాణ రైతులకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలియజేశారు. రైతులకు ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతిలో వ్యవసాయ సాగులో సలహాలు, సూచనలను అందజేయడంతో పాటు సేవలు విస్తృతం చేయనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Good News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఉచితంగా..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ రైతులకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలియజేశారు. రైతులకు ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతిలో వ్యవసాయ సాగులో సలహాలు, సూచనలను అందజేయడంతో పాటు సేవలు విస్తృతం చేయనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన రైతు వేదికలను దేనికి ఉపయోగిస్తారో చెప్పారు.

రైతు వేదికలను ఆధునికరించి అగ్రికల్చర్ సేవలను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించినారు. రైతు వేదికలను ఆధునికరించి వ్యవసాయ సేవలను విస్తరించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది.

అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సేవలను అందించడానికి సిద్ధమైంది. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు అవసరమైన ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ టెలివిజన్లను అందుబాటులోకి తీసుకురానున్నది . రైతు వేదికలను కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దనున్నది. గ్రామస్థాయిలో ఉండే వ్యవసాయ అధికారులతో కమ్యూనికేషన్ చేస్తూ వ్యవసాయ రంగంలో వచ్చే నూతన మార్పులపై ఎప్పటికప్పుడు రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా అవగాహన కల్పించనున్నారు. కాన్ఫరెన్స్ ల ద్వారా ఎఈఓ, వెటర్నరీ డాక్టర్లు, రైతులతో సమావేశాలు నిర్వహించి సలహాలు సూచనలు ఇవ్వనున్నారు.

ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 500లతో నిమిషాల్లోనే..!

తెలంగాణలో 33 జిల్లాల్లో హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో రైతు వేదికలను ఆధునికరించనున్నారు. మొదటి విడతలో మొత్తం 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ కోసం ప్రత్యేక సాఫ్టువేర్ టెస్టింగ్ కూడా పూర్తి చేశారు. విడతలవారీగా 2600 వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ సేవలను విస్తృతం చేయనున్నారు.

ALSO READ : తెలంగాణలో రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ.. ఆ తేదీ లోపు తీసుకున్న వారికే..!

రైతులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చి వారి సమస్యలను పరిష్కరించే దిశగా సైంటిస్టులు వ్యవసాయ అధికారులు రైతులకు వివరిస్తారు. వ్యవసాయ ఆధునికరణకు ఉపయోగపడే ఆధునిక పద్ధతులను అధికారులు రైతులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా సలహాలు సూచనలు ఇవ్వనున్నారు.