తెలంగాణ : రైతులకు రెండు లక్షల రుణమాఫీ.. సీఎం రేవంత్ ప్రత్యేక చర్యలు, బడ్జెట్ కోసం కసరత్తు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల రుణమాఫీ పై ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టారు. ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేసేందుకు కసరత్తు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ : రైతులకు రెండు లక్షల రుణమాఫీ.. సీఎం రేవంత్ ప్రత్యేక చర్యలు, బడ్జెట్ కోసం కసరత్తు..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల రుణమాఫీ పై ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టారు. ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేసేందుకు కసరత్తు నిర్వహిస్తున్నారు.

రైతులకు రైతుబంధు కూడా వారి వారి అకౌంట్లో నేరుగా వేస్తున్నారు. అదేవిధంగా రైతులకు ఇచ్చిన మరో ప్రధానమైన హామీ రైతు రుణమాఫీ.. రైతులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

ALSO READ : మిర్యాలగూడ : సొంత అన్నని హత్య చేసిన తమ్ముడు.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు..!

ప్రభుత్వం వారికి గతంలో ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేసిన విధంగా రుణమాఫీ చేసేందుకు ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఒకే దఫా రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయనున్నట్లు సమాచారం. రైతుల తరఫున బ్యాంకులకు గ్యారెంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణం తీసుకొని రైతులకు రుణమాఫీ ఓకే దఫా చేయనున్నట్లు సమాచారం. అందుకు అధికార పెద్దలు కసరత్తు నిర్వహిస్తున్నారు.

కాగా 2023 డిసెంబర్ 7వ తేదీకి ముందు తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ చేయనున్నట్లు సమాచారం. రెండు లక్షల లోపు రాష్ట్రంలో రైతుల రుణాలు 28 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. ఒకేసారి వివిధ బ్యాంకుల నుంచి రుణాలు ప్రభుత్వమే తీసుకుని రైతుల రుణాలను మాఫీ చేయనున్నట్లు సమాచారం. అందుకు కసరత్తు సాగుతోంది.

ALSO READ : BREAKING : ప్రేమించి పెళ్లి చేసుకుని.. జల్సాలకు అలవాటు పడి, చివరికి ఇలా..!

రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసి తిరిగి మళ్ళీ పంట రుణాలు ఇచ్చే విధంగా కసరత్తు నిర్వహిస్తున్నారు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా వారి వారి ఎకౌంట్లోకి మాఫీ డబ్బులను వేసే విధంగా బ్యాంకర్లతో కూడా సమావేశం నిర్వహించారు. రైతుల పంట రుణాల మాఫీకి అవసరమైన బడ్జెట్ కోసం చర్చలు కొనసాగుతున్నాయి.