మిర్యాలగూడ : సొంత అన్నని హత్య చేసిన తమ్ముడు.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు..!

మానవత్వం లేకుండా పోయింది. సొంత అన్ననే ఆస్తికోసం తమ్ముడు హత్య చేసిన సంఘటన మిర్యాలగూడ మండలం అవంతిపురంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనను మిర్యాలగూడ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో విచారణ చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

మిర్యాలగూడ : సొంత అన్నని హత్య చేసిన తమ్ముడు.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు..!

మిర్యాలగూడ , మనసాక్షి :

మానవత్వం లేకుండా పోయింది. సొంత అన్ననే ఆస్తికోసం తమ్ముడు హత్య చేసిన సంఘటన మిర్యాలగూడ మండలం అవంతిపురంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనను మిర్యాలగూడ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో విచారణ చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

27 డిసెంబర్ 2023 న రాత్రి సుమారు 9 గంటలకు మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామములో నివాసము ఉండే పట్టేటి నాగయ్య (53) కూలీ పని చేస్తాడు. అతని స్వంత తమ్ముడు అగు పట్టేటి శ్రీను తండ్రి ఆస్థి అయిన ప్రస్తుతము వారు ఉంటున్న ఇల్లు ఖాళీ (6 గుంటలు) స్థలమును అన్న నాగయ్య పంచుకొనీయడం లేదని,

ALSO READ : Free Bus Travel : ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త నిబంధనలు.. పాటించకపోతే రూ 500 ఫైన్..!

ఓంటరిగా ఉంటున్న తన అన్న నాగయ్యను చంపేస్తే మొత్తం ఇంటి స్థలాలు తమ్ముడు శ్రీను ఆక్రమించుకోవాలనే దురుద్దేశం కలిగి అన్నాడు. అన్న నాగయ్య పైన కక్ష పెంచుకున్నాడు. అతనిని చంపేయాలని ప్లాన్ చేసుకొని అందుకుగాను అవంతిపురం నకు చెందిన పాత నేరస్థుడు ఈర్ల మల్లేశ్ , ఇంకో స్నేహితుడు సతీష్ (పెద్దదేవులపల్లి) గ్రామస్తుడిని వారికి కొన్ని డబ్బులు ఇస్తానని వారి ఇద్దరి సహాయము తీసుకున్నాడు.

ఇంటి వద్ద ఉన్న పట్టేటి నాగయ్య ను ఇనుప పైపు రాడ్డు తో బలంగా కొట్టగా స్పృహ కోల్పోయినాడు. వారు చనిపోయాడనుకొని పారిపోయినారు. అట్టి వారు కొట్టిన దెబ్బలకు ఉస్మానియా ఆసుపత్రిలో నాగయ్య చికిత్స పొందుచూ 2024 జనవరి 2వ తేదీ న చనిపోయినాడు.

ALSO READ : BREAKING : ప్రేమించి పెళ్లి చేసుకుని.. జల్సాలకు అలవాటు పడి, చివరికి ఇలా..!

మృతుడి స్వంత చెల్లెలు ఉట్కూరి అరుణఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

శనివారం ఉదయం 6 గంటలకు హత్య చేసిన నేరస్థులు ఏ-1 పట్టేటి శ్రీను , ఏ-2 ఈర్ల మల్లేశ్ , అవంతిపురం మిర్యాలగూడ మండలం అను వారిని సమాచారము పైన పట్టుబడి చేసి, వారు నాగయ్య ను చంపుటకు ఉపయోగించిన ఇనుప పైపు రాడ్డు ను స్వాధీనపర్చుకొనైనది. నేరస్థులను మిర్యాలగూడ కోర్టులో హాజరు పరచి రిమాండుకు తరలించారు.

నేరస్థులను పట్టుకొనుటలో ప్రత్యేక చొరవ చూపిన ఎస్.ఐ మిర్యాలగూడ రూరల్ సిఐ సత్యనారాయణ , ఎస్సై నరసింహు, పి.సి(3117) బి శ్రీనివాస్ లను డి.యస్.పి వెంకటగిరి అభినందించినారు.

ALSO  READ : నల్గొండ : అతడు డ్రైవింగ్.. ఆమె స్నాచింగ్..!