Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newstravelజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Free Bus Travel : ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త నిబంధనలు.. పాటించకపోతే రూ 500 ఫైన్..!

Free Bus Travel : ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త నిబంధనలు.. పాటించకపోతే రూ 500 ఫైన్..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తున్నది. ఉచిత బస్సు ప్రయాణానికి ఎలాంటి అర్హత లేకుండా కేవలం ఆధార్ కార్డు చూపిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా తీసుకుపోవాలని నిబంధనలు ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. కాగా ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ నూతన నిబంధనలు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ALSO READ : Runa mafi : రైతు రుణమాఫీ పై రేవంత్ గుడ్ న్యూస్..!

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డు అయినా సరే దానిని చూపించి నిబంధనల మేరకు ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని తెలిపారు. పాన్ కార్డులో అడ్రస్ ఉండకపోవడం వల్ల అది ఉచిత బస్సు ప్రయాణానికి చెల్లుబాటు కాదని తేల్చి చెప్పారు.

ఒరిజినల్ ఆధార్ కార్డులు గాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డులు కానీ ఉంటే ఒరిజినల్ చూపించాలని తాము పదే పదే చెప్పినప్పటికీ కొంతమంది దానిని అనుసరించడం లేదని సజ్జనార్ పేర్కొన్నారువ కొంతమంది స్మార్ట్ ఫోన్లో ఉండే ఫోటోలను, గుర్తింపు కార్డులను చూపించడం చేస్తున్నారని ఇకపై అవి చెల్లుబాటు కావని తేల్చి చెప్పారు. ప్రయాణ సమయంలో తమ గుర్తింపు కార్డు ఫోటో కాపీలు కలర్ జిరాక్స్ ను చూపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అవి చెల్లవని ఆయన తేల్చి చెప్పారు.

ALSOREA : రేవంత్ రెడ్డిని కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్

దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురి కావడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. మహిళలందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంతం మహిళలకే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు టికెట్ తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారని చెప్పారు. ఒకవేళ జీరో టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే అది చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదం పడుతుందని హెచ్చరించారు. అదేవిధంగా సదరు ప్రయాణికురాలికి 500 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుందని చెప్పారు.

ALSO READ : తెలంగాణ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి..!

మరిన్ని వార్తలు