Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంహైదరాబాద్

Runa mafi : రైతు రుణమాఫీ పై రేవంత్ గుడ్ న్యూస్..!

Runa mafi : రైతు రుణమాఫీ పై రేవంత్ గుడ్ న్యూస్..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతు బంధు ద్వారా రైతులకు పంట సహాయం చేయడం ప్రారంభమైంది. కాగా రైతు రుణమాఫీ పై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల రుణాలు మాఫీ చేసే విషయంపై కీలకమైన ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో రెండు లక్షల రూపాయల వరకు రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా రైతుల రుణమాఫీ అంశంపై ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నది.

త్వరలోనే రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కార్యాచరణ ఖరారు చేశారు. రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు నిధుల సమీకరణ పై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రైతుల అప్పులు లెక్కగట్టి అసలు, వడ్డీతో సహా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని అమలు చేసే మార్గాలపై కసరత్తు మొదలుపెట్టారు.

ALSO READ : నల్లగొండ : మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం..!

తెలంగాణలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతులు బ్యాంకులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో అప్పులు తీసుకుని ఉన్నారు. పంట పెట్టుబడుల కోసం రైతులు సుమారుగా 32 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఈ బకాయిలు ఉన్నాయి. కాగా ఒక్కొక్క రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 40,000 కోట్ల రూపాయల వరకు బ్యాంకులో అప్పులు ఉన్నట్లు అధికారులు కూడా లెక్కలు తేల్చారు.

ALSO READ : BREAKING : కూరగాయల ట్రేలతో రవాణా.. పోలీసుల తనిఖీల్లో నల్గొండ జిల్లాలో బయటపడ్డ స్మగ్లింగ్..!

ఈ విషయంపై కసరత్తు కొనసాగుతుంది. బ్యాంకర్లతో మాట్లాడి ప్రభుత్వం రుణం తీసుకొని రైతుల రుణమాఫీ చేయాలనే మార్గంపై చర్చ జరుగుతుంది. ప్రభుత్వమే బ్యాంకులకు అసలు వడ్డీ కలిసి చెల్లించే విధంగా చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా రైతులకు కొత్త రుణాలు ఇచ్చే అవకాశం లేదని చెప్పవచ్చును.

ALSO READ : BREAKING : నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలి నలుగురు మృతి

మరిన్ని వార్తలు