నల్లగొండ : మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం..!

నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ పదవిని కోల్పోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నల్లగొండ జిల్లాలో రాజకీయ పరిణామాలలో మార్పు చోటు చేసుకుంది.

నల్లగొండ : మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం..!

నలగొండ, మన సాక్షి :

నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ పదవిని కోల్పోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నల్లగొండ జిల్లాలో రాజకీయ పరిణామాలలో మార్పు చోటు చేసుకుంది.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై కాంగ్రెస్ కౌన్సిలర్లు , పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.

ALSO READ : లెఫ్ట్..రైట్.. హార్సిలీహిల్స్ లో మిట్స్ విద్యార్థుల ట్రెక్కింగ్…!!

సోమవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ పార్టీకి 41 మంది కౌన్సిలర్లు, బేఆర్ఎస్కు అయిదుగురు. కౌన్సిలర్లు అనుకూలంగా చేతులెత్తగా. ముగ్గురు సభ్యులు గైర్హాజరుకాగా. ఒక సభ్యుడు న్యూట్రల్ గా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానము నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు .

దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తేదీని తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపారు.

ALSO READ : మనసాక్షి నూతన సంవత్సర 2024 క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్