BREAKING : కూరగాయల ట్రేలతో రవాణా.. పోలీసుల తనిఖీల్లో నల్గొండ జిల్లాలో బయటపడ్డ స్మగ్లింగ్..!

తెలంగాణ రాష్ర్ట౦ ప్రతిష్టాత్మికంగా తీసుకొన్న మాదకద్రవ్యాల నిర్మూలన లో భాగ౦గా, తెలంగాణ రాష్ర్ట డి.జి.పి ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపింది.

BREAKING : కూరగాయల ట్రేలతో రవాణా.. పోలీసుల తనిఖీల్లో నల్గొండ జిల్లాలో బయటపడ్డ స్మగ్లింగ్..!

నలుగురు నిందితులు అరెస్ట్

ఒక డిసియం, మూడు సెల్ ఫోన్స్ స్వాదీనం ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ, మనసాక్షి :

తెలంగాణ రాష్ర్ట౦ ప్రతిష్టాత్మికంగా తీసుకొన్న మాదకద్రవ్యాల నిర్మూలన లో భాగ౦గా, తెలంగాణ రాష్ర్ట డి.జి.పి ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపింది.

నిరంతర నిఘా లో బాగంగా సోమవారం సమాచారం మేరకు ఆంద్ర రాష్ట్ర నుంచి అంతర్ రాష్ట్ర ముఠా ఒక డిసియం వాహనంలో గంజాయిని తరలిస్తున్నారని తెలపగా నాగార్జున సాగర్/విజయపూరి పోలీసు స్టేషన్ యస్.ఐ సంపత్ తన సిబ్బందితో కలిసి ఆంద్రా తెలంగాణా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు.

తెల్లవారుజామున ఒక డిసియం వాహనంలో కూరగాయలు ట్రే లతో వచ్చింది అట్టి వాహనంను ఆపి తనికి చేయగా అందులో ఉన్న వ్యక్తులు దిగి పారిపోతుండగా పట్టుబడి చేసి వాహనమును తనికి చేయగా అందులో బ్రౌన్ కలర్ టేపు చుట్టి ఉన్నటువంటి 168 పాకెట్లను సుమారు 336 కిలోల గంజాయిని స్వాదీనము చేసుకొని అదుపులోకి తీసుకున్నారు.

ALSO READ : నల్లగొండ : మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం..!

విిచారించగా వివరాల ప్రకారం.. మహా రాష్ట్ర కి చెందిన జ్ఞానోబా అమోల్, గణపతి బసవరాజ్ సోనాల్, సంగమేశ్వర సదా శివ జంగనే, ఖయ్యూమ్ ఇషాకే లమని తెలిపి, జ్ఞానోబా అమోల్ ఘొరే డ్రైవర్ గా పని చేసే క్రమంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన జయపాల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

జయపాల్ గంజాయి సరఫరా చేస్తుంటాడు అదే క్రమంలో జ్ఞానోబా అమోల్ ఘొరేకి విజయనగరం నుంచి గంజాయి తీసుకొని మహారాష్ట్ర కి తీసుకవెళ్ళి అక్కడ నేను చెప్పిన వ్యక్తికి సరఫరా చేస్తే ఒక లక్ష రూపాయలు ఇస్తా అనగా ఒప్పుకొని జ్ఞానోబా అమోల్ ఘొరే తో పాటు ముగ్గురు వెళ్ళి అక్కడ నుండి లోడ్ చేసుకొని వరంగల్ మీదిగా వెళ్తే పట్టుబడతామని గుంటూర్, మాచర్ల మీదిగా వస్తూ పట్టుబడ్డగా, వీరి వద్ద నుండి 168 పాకెట్స్ సుమారు 336 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండుకి పంపినట్లు ఎస్పీ తెలిపారు.

నిందితుల వివరాలు : 

జ్ఞానోబా అమోల్ ఘొర ఎడ్వాల్ నగ్నాట గ్రామం, చకుర్ తాలూక్, లాతూర్ జిల్లా, మహారాష్ట్ర
గణపతి బసవరాజ్ కమీనర్ తాలూకా, బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం. సంగమేశ్వర నగ్నాట గ్రామం, చకుర్ తాలూక్, లాతూర్ జిల్లా, మహారాష్ట్ర. ఖయ్యూమ్ ఇషా వడవల్ నాగనాత గ్రామం, చకుర్ తాలూకా, లాతూర్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం. జయపాల్ , బాన్స్ వాడ ,నిజామాబాద్ జిల్లా తో పాటు ఇంకా నలుగురు పరారీలో ఉన్నారు వీరిని కూడా త్వరలో పట్టుకుంటాం. అన్నారు.

ALSO READ : BREAKING : నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలి నలుగురు మృతి

అక్రమ గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా చేస్తే ఉపేక్షించేది లేదు : ఎస్పీ చందనా దీప్తి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదకద్రవ్య వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉక్కుపాదంతో అణిచివేస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించము,యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.

గంజాయి విక్రయాల గురించి గాని ,సేవించే వ్యక్తుల గురించి , ఏ రూపంలోనైనా మాదకద్రవ్యాలను సరఫరా చేసేవారి గురించి మీకు సమాచారం తెలిస్తే, డయల్ 100 ద్వారా లేదా నేరుగా తెలియజేయవచ్చు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మాదకద్రవ్యాల నివారణలో ప్రజలు, పోలీసు వారికి సహకరించి, మాదకద్రవ్యాల రహిత రాస్త్రం గా తీర్చిదిద్దడంలో అందరూ పాలుపంచుకోవాలని ఎస్పీ చందనా దీప్తి కోరారు.

ALSO READ : మనసాక్షి నూతన సంవత్సర 2024 క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్