నల్గొండ : అతడు డ్రైవింగ్.. ఆమె స్నాచింగ్..!

చైన్ స్నాచింగ్ కు పాల్పడేది మగవారే అనుకుంటే పొరపాటే.. నల్గొండ జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది . స్కూటీపై అతడు డ్రైవింగ్ చేస్తాడు.. వెనక కూర్చున్న ఆమె స్నాచింగ్ కు పాల్పడుతుంది.

నల్గొండ : అతడు డ్రైవింగ్.. ఆమె స్నాచింగ్..!

కిలోమీటర్ల కొద్ది వెంబడించినా.. ఫలితం లేదు

మర్రిగూడ, మన సాక్షి:

చైన్ స్నాచింగ్ కు పాల్పడేది మగవారే అనుకుంటే పొరపాటే.. నల్గొండ జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది . స్కూటీపై అతడు డ్రైవింగ్ చేస్తాడు.. వెనక కూర్చున్న ఆమె స్నాచింగ్ కు పాల్పడుతుంది. ఇలాంటి సంఘటన నల్గొండ జిల్లా మర్రిగూడలో చోటుచేసుకుంది. కిలోమీటర్ల కొద్ది వెంబడించినా.. ఫలితం లేకుండా పోయింది.

వివరాల ప్రకారం.. మహిళా మెడలో నుంచి ఏడు తులాల పుస్తెల తాడును దుండగులు అపహరించారు. ఈ సంఘటన మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామపంచాయతీ లోని తిరుగండ్ల పల్లి గేట్ వద్ద జరిగినది, వివరాలు కెళ్తే బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..

ALSO READ : Free Bus Travel : ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త నిబంధనలు.. పాటించకపోతే రూ 500 ఫైన్..!

సాటు సునీత తిరగండ్లపల్లి గ్రామంలో గ్యాస్ కేవైసీ కోసం మర్రిగూడ వెళ్లేందుకు తన గ్రామ స్టేజీ వద్ద వేచి ఉంది. అదే సమయంలో మాల్ వైపు నుంచి ఒక మగ, ఆడపిల్ల స్కూటీపై వచ్చారు. మర్రిగూడ గ్రామానికి వెళ్లాలి అడ్రస్ తెలియడం లేదు కొంచెం చూపించమని వారు అడిగారు. ఆమెకు లిఫ్ట్ ఇచ్చి కొంత దూరం వెళ్లిన తర్వాత మార్గ మధ్యలో బండి ఆపి ఆ మహిళ కళ్ళలో గుర్తుతెలియదో రసాయనాన్ని చల్లారు.

ఆమె మెడలోని దాదాపు 7 తులాల బంగారు గొలుసు (మంగళ సూత్రం) లాక్కొని మాల్ వైపు పారిపోయారు. కళ్ళు మంటలు వేస్తున్న తమకు సంబంధించిన వారికి ఫోన్ చేయగా.. వారు కొంత దూరం వాళ్ళను వెంబడించిన దొరకలేదని ఆమె తెలిపారు. సాటు సునీత ఇచ్చిన ఫిర్యాదును కేసు Cr.No:06/24 U/s 356,379 IPC లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, సీసీ కెమెరాలు వాళ్లని ఫోటోలను గుర్తించామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు.

ALSO READ : హైదరాబాద్ : 13 దేశాల ప్రతినిధులకు రేవంత్ రెడ్డి ఆతిథ్యం..!