Ration Cards : తెలంగాణలో ప్రజలకు మరో శుభవార్త.. కొత్త రేషన్ కార్డులకు ధరఖాస్తులు, వారికి కూడా..!

Ration Cards : తెలంగాణలో ప్రజలకు మరో శుభవార్త.. కొత్త రేషన్ కార్డులకు ధరఖాస్తులు, వారికి కూడా..!
మనసాక్షి :
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త తెలియజేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పేద ప్రజలకు రేషన్ కార్డులు అందజేసేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియ సంక్రాంతి నుంచి ప్రారంభించనున్నారు. సంక్రాంతి పండుగ నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతు భరోసా పథకం తో పాటు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో… పకడ్బందీగా ముందడుగు వేస్తోంది. ఎలాంటి అక్రమాలు, పొరపాట్లు జరగకుండా…నిజమైన అర్హులకు రేషన్ బియ్యం, నిత్యావసరాలకు ఇచ్చేందకు కృషి చేస్తోంది.
అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే కొత్తగా పెళ్ళైన జంటలకు కూడా రేషన్ కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల్లో చిప్ అమర్చుతారు. దీనిలో లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి విరాలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
మరి కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు ఎప్పుడు అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ కోసం…పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల కోసం సంక్రాంతి నుంచి అప్లికేషన్లు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డు కోసం 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 32 లక్షల కుటుంబాలను లబ్దిదారులుగా అధికారులు గుర్తించారు.
ప్రభుత్వం చాలా పథకాలకు రేషన్ కార్డు లింక్ పెట్టడంతో…ఎలాగైనా రేషన్ కార్డు ఉండాలని ప్రజలకు అర్థమైంది. చాలా మంది రేషన్ సరుకులు అవసరం లేకున్నా…రైతు రుణామాఫి, గ్యాస్ సిలిండర్ సబ్సిడి లాంటి మిగతా ప్రభుత్వ పథకాలకు అర్హత కోసం రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారు. ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ సారి గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా…. అర్హులందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పుడున్న ఆదాయ పరిమితిని కూడా పెంచనున్నట్టు సమాచారం.
దశాబ్దాలుగా అస్తవ్యస్తంగా ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు…మంత్రి వర్గ సమావేశంలో చర్చించి తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మొత్తానికి అర్హలయిన అందరికీ కొత్త రేషన్ కార్డులు అందేలా…వారిలో కొత్త కాపురాలు పెట్టిన వారికి కూడా అందేట్టు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులకు కూడా రేషన్ కార్డు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
Reporting :
Mahipal Reddy, Hyderabad
MOST READ :
-
Hyderabad Biryani : హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ ఎంతో చూద్దామా.. దేశంలోనే హైదరాబాద్ బిర్యానీకి క్రేజ్ ఎందుకో..!
-
Gold : బంగారంలో 24, 22 క్యారెట్స్ అంటే ఏంటి.. తేడా తెలుసా..!
-
PM Kisan : PMKYతో రైతుల ఖాతాలలో రూ.6వేలు.. లబ్దిదారుల చెకింగ్.. కొత్ర ధరఖాస్తు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు సీలింగ్.. మీరు అర్హులేనా, లేటెస్ట్ అప్డేట్..!
-
PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజనకు దరఖాస్తులు.. మీసేవ కేంద్రాల్లో రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!









