Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsfoodవైద్యంహైదరాబాద్

Hyderabad Biryani : హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ ఎంతో చూద్దామా.. దేశంలోనే హైదరాబాద్ బిర్యానీకి క్రేజ్ ఎందుకో..!

Hyderabad Biryani : హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ ఎంతో చూద్దామా.. దేశంలోనే హైదరాబాద్ బిర్యానీకి క్రేజ్ ఎందుకో..!

మన సాక్షి :

ఘుమఘుమలాడే వాసన… అదిరిపోయే రుచి…ఆహార ప్రియులను ఆహా అనిపించేలా ఉంటుంది హైదరాబాద్‌ బిర్యానీ. హైదరాబాద్‌ బిర్యానీ వరల్డ్‌ వైడ్‌ ఎంతో ఫేమస్‌. అది వెజ్, నాన్‌వెజ్‌ ఏదైనా సరే…హైదరాబాద్‌ బిర్యానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది.

హైదారాబాద్‌ బిర్యానీ టేస్ట్‌తో పాటు…రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా 2004లో ఆహార ప్రియులు ఎక్కువగా ఆర్డర్‌ పెట్టిన ఫుడ్‌గా హైదరాబాద్‌ బిర్యానీ అని ప్రముఖ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రకటించింది. ప్రతి నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ పెట్టారట హైదరాబాద్ ఫుడ్‌ లవర్స్‌. దీంతో హైదరాబాద్‌ వాసులు బిర్యానీ ప్రియులని కన్‌ఫామ్‌ అయ్యింది.

దేశం మొత్తం మీద కేవలం హైదరాబాద్‌లోనే…1 కోటి 57 లక్షల బిర్యానీ ఆర్డర్‌లు పెట్టారట. అంతేకాందండోయ్‌… బిర్యానీలోనూ చికెన్ బిర్యానీకే హైదరాబాదీలు ఓటు వేశారని… స్విగ్గీ తేల్చింది. 2024లో మొత్తం మీద స్విగ్గీకి 97 లక్షల 21 వేల చికెన్ బిర్యానీ ఆర్డర్లు వచ్చాయట.

దాదాపు ప్రతి నిమిషానికి 21 చికెన్‌ బిర్యానీ ఆర్డర్లు వచ్చాయట. క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగేటప్పుడు హైదరాబాదీలు ఎక్కువగా బిర్యానీలు ఆర్డర్‌ పెడ్తారట. అందులోనూ…ఇండియా మ్యాచ్‌ ఉన్నప్పుడు బిర్యానీల ఆర్డర్‌ మరింత పెరుగుతుందట. ఎంచక్కా తమకు నచ్చిన బిర్యానీ తింటూ…క్రికెట్‌ చూస్తూ…ఎంజాయ్‌ చెయ్యడంలో హైదరాబాదీలు ఆరితేరారు.

హైదరాబాద్‌ తర్వాత బిర్యానీ ఆర్డర్లలో బెంగుళూరు రెండో స్థానంలో ఉంది. బెంగుళూరులో ఏడాదిలో స్విగ్గీలో పెట్టిన బిర్యానీ ఆర్డర్ల సంఖ్య 77 లక్షలు. 46 లక్షల బిర్యానీ ఆర్డర్లతో చెన్నై మూడో స్థానంలో నిలిచిందట.

2024 నవంబర్‌ 22 వరకు స్విగ్గీలో 8 కోట్ల 3 లక్షల బిర్యానీ ఆర్డర్లు అందాయి. చికెన్ బిర్యానీ ఆర్డర్లు 4 కోట్ల 9 లక్షలు ఉన్నాయట. స్విగ్గీ ఆర్డర్లలో… దేశవ్యాప్తంగా బిర్యానీ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలించింది. బిర్యానీ ఆర్డర్లు ఇలా రికార్డు క్రియేట్‌ చెయ్యడం… వరుసగా ఇది 9వ ఏడు.

అయితే దేశంలో ప్రతి నిమిషం స్విగ్గీకి 158 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయట. ప్రతి సెకనుకు 2 బిర్యానీ ఆర్డర్లు అన్నమాట. 2 కోట్ల 3 లక్షల ఆర్డర్లతో దోస…బిర్యానీ తర్వాత స్విగ్గీ ఆర్డర్లలో రెండో స్థానంలో నిలిచిందట. దోసల విషయంలో…బెంగళూరు 22 లక్షల ఆర్డర్లతో మొదటి స్థానంలో నిలిచింది.

ఇది కేవలం స్విగ్గీ లెక్క మాత్రమే. మరి ఇంకా చాలా ఫుడ్‌ డెలివరీ సంస్థలు పని చేస్తున్నాయి. వాటిలో కూడా బిర్యానీ ఆర్డర్లే ఎక్కువని తేలింది. ఇంకా ఆన్‌లైన్‌ ఆర్డర్లు కాకుండా…డైరెక్టుగా ఎన్ని బిర్యానీలు లాగించేస్తున్నారో హైదరాబాదీలు అని ఆశ్చర్యపోతోంది ప్రపంచం. ఇప్పుడీ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి…హైదరాబాద్‌ బిర్యానీ సత్తా చాటుతోంది.

Reporting 

Mahipal Reddy, Hyderabad 

MOST READ : 

మరిన్ని వార్తలు