తెలంగాణBreaking Newstravel

TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఈవి పాలసీ, వారందరికీ ఉచితం..!

TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఈవి పాలసీ, వారందరికీ ఉచితం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో:

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈవి (ఎలక్ట్రానిక్ వెహికిల్) నూతన పాలసీని తీసుకువచ్చింది. దీని ద్వారా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% రాయితీ అమలు చేయనున్నది.

నూతనంగా ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసేవారు అందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు, కార్లు, ఎలక్ట్రిక్ బస్సులపై కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపారు.

ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, అలాంటి పరిస్థితి హైదరాబాదులో రాకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాతావరణ కాలుష్యం హైదరాబాద్ మహానగరంలో రాకుండా ముందుగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

దాంతో పాటు 15 సంవత్సరాలు దాటిన వాహనాలను ప్రజలు స్వచ్ఛందంగా స్క్రాప్ కు వేయాలని ఆయన సూచించారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారు సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు