Breaking Newsతెలంగాణసంక్షేమం

TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఆరు గ్యారెంటీలలో భాగంగా మరో కొత్త పథకాన్ని తీసుకురానున్నది. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన కవులు, కళాకారులకు నెలకు 6000 రూపాయల పింఛన్ ఇవ్వాలన్న హామీపై ప్రభుత్వం దృష్టి సారించింది.

కళాకారులు మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ ఆధ్వర్యంలో మంత్రి జూపల్లి ని కలిశారు. పింఛన్లు మంజూరు చేయాలని, హెల్త్ కార్డులు, ఆరోగ్య భీమా, గుర్తింపు కార్డులు కూడా అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. దాంతో సానుకూలంగా స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు అర్హులైన వృద్ధ కళాకారులు అందరికీ పింఛన్ ఇవ్వాలని అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు ఎంతో త్యాగం చేశారని కళా రంగానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తుందని, వారి సంక్షేమానికి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే వృద్ధులైన కళాకారులు కనీస అవసరాల కోసం కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, కళాకారులకు పింఛన్ ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తుందని చెప్పారు.

MOST READ : 

  1. Nalgonda : సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. మిర్యాలగూడ డిటి జావిద్ అరెస్ట్..!

  2. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!

  3. Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!

  4. CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.. వారికి 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా..!

  5. Nagarjuna Sagar : పెరుగుతున్న నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం..!

  6. KCR : ఐదుగురు సంతానం.. కొడుకు పేరు కేసీఆర్ గా నామకరణం చేసిన అభిమాని..!

మరిన్ని వార్తలు