Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : రేషన్ డీలర్ కోసం దరఖాస్తుల గడువు పొడిగింపు..!

Miryalaguda : రేషన్ డీలర్ కోసం దరఖాస్తుల గడువు పొడిగింపు..!

మిర్యాలగూడ, మనసాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును పొడిగించినట్లు సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తెలిపారు.

మిర్యాలగూడ డివిజన్ పరిధిలో 30 రేషన్ డీలర్ ఖాళీలకు గాను ఈ నెల 04 వ తేదీ నుంచి 18 వరకు సంబంధిత తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవలసి నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులకు దరఖాస్తుదారులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.

కుటుంబ సమగ్ర సర్వే, వరి పంట కోతలు కారణంగా దరఖాస్తు దారులకు మరోసారి గడువు పెంచారు. ఈ నెల 25 వ తేదీ వరకు దరఖాస్తుల గడువు పొడిగిస్తూ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు