తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District collector : ప్రజావాాణి కి దరఖాస్తుల వెల్లువ..!

District collector : ప్రజావాాణి కి దరఖాస్తుల వెల్లువ..!

సూర్యాపేట, మనసాక్షి :

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిం చాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని సమావేశ మంది రంలో సోమవారం నిర్వ హించిన ప్రజావాణి కార్య క్రమంలో 80 దరఖాస్తు లను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అత్యధికంగా భూ సమస్యల పై,హౌజింగ్ పై దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.

తాసీల్దార్లు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని పేర్కొ న్నారు. వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులు ఎక్కువగా ఉన్నవని, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులలో భూ సమస్యల పై 32,
హౌజింగ్ 10, మున్సిపాలిటీ 6, డి ఆర్ డి ఏ 4, డి డబ్ల్యు ఓ 3 ఇతర శాఖలకు సంబందించినవి 25 మొత్తం 80 దరఖాస్తులు వచ్చినవని వీటిని త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష,కలెక్టరేట్ ఎలక్షన్ సూపరిండెంట్ శ్రీనివాసరాజు, డీఎస్ఓ రాజేశ్వరరావు, డి ఏం హెచ్ ఓ కోటాచలం, డీ బ్ల్యూఓ నరసింహారావు, ఎస్ సి కార్పొరేషన్ సంక్షేమ అధికారి లత, ఎల్డియం బాపూజీ, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, సీపీఓ కిషన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

  2. District collector : సారూ.. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటాం.. జిల్లా కలెక్టర్ ను వేడుకున్న నిరుపేద..!

  3. PM Kisan : పీఎం కిసాన్ రైతులకు కీలక అప్డేట్.. ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!

  4. Gold Price : గోల్డ్ మళ్లీ డమాల్.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు