Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జాతీయంBreaking Newsవ్యవసాయం

PM Kisan : పీఎం కిసాన్ రైతులకు కీలక అప్డేట్.. ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతులకు కీలక అప్డేట్.. ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ రంగాన్ని డిజిటలైజ్ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ కార్డులను జారీ చేయనున్నది. ఇది ప్రధానమంత్రి కిసాన్ కు కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారితోపాటు వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు తప్పనిసరి చేసుకోవాల్సి ఉంది. ఈ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తారు. ఈ కార్డు ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చును.

కేంద్ర ప్రభుత్వం రైతులకు 11 అంకెల ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డును జారీ చేయనున్నది. ఈ కార్డు ద్వారా బ్యాంకు రుణాలు పొందవచ్చును. ఈ కార్డు ఉన్న ప్రతి రైతు పట్టాదారు పాస్ పుస్తకం, ఇతర పత్రాలు చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఒక కార్డు చూపిస్తే సరిపోతుంది. బ్యాంకు రుణాలు పొందవచ్చును.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ రంగాన్ని డిజిటలైజ్ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కిసాన్ కు దరఖాస్తు చేసుకునే కొత్త రైతులతో పాటు వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఈ గుర్తింపు కార్డును పొందాల్సి ఉంది.

ఈ కార్డు 11 అంకెలతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పేరుతో ఉంటుంది. ఈ కార్డు పై రైతు పేరు, వారి స్వగ్రామం, ఏ ఏ సర్వే నెంబర్లలో ఎంత భూమి ఉంది. భూమి యొక్క సారం, అందులో పండించగల పంటను, రైతులకు ఉన్న అప్పుల వివరాలు, దాంతో పాటు పీఎం కిసాన్ కు సంబంధించి ఇతర వ్యవసాయ పథకాల ముఖ్యమైన సమాచారం ఉంటుంది.

అయితే ఈ ప్రక్రియను అమలు చేయడానికి ఏప్రిల్ 15వ తేదీన కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యవసాయ అధికారులకు హైదరాబాదులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ ప్రక్రియ వాస్తవానికి ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభం కావలసి ఉంది. కానీ ఉన్నతాధికారుల ఆదేశాల వాయిదా పడింది. అయితే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు వారి ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా వారి ఫోన్ నెంబర్ ను సంబంధిత మండల ఏఈఓ లకు అందించాల్సి ఉంటుంది. వారు దానిని ఆన్‌లైన్ లో నమోదు చేసి 11 అంకాల ప్రత్యేక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని రైతులకు అందజేస్తారు. ఈ ప్రక్రియ వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవానికి నాంది పలకనున్నది.

MOST READ :

  1. Gold Price : పడిపోయిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. ఎంతంటే..!

  2. Big Alert : ఈ పేరుతో ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు వస్తే జాగ్రత్త.. లేదంటే మీ ఖాతా ఖాళీ..!

  3. KSRTC : చీ.. చీ.. నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై బస్ కండక్టర్.. (వీడియో వైరల్)

  4. District collector : సారూ.. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటాం.. జిల్లా కలెక్టర్ ను వేడుకున్న నిరుపేద..!

  5. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!

మరిన్ని వార్తలు