RRC : రాత పరీక్ష లేకుండా టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు.. 5647 ఖాళీల భర్తీ..!
RRC : రాత పరీక్ష లేకుండా టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు.. 5647 ఖాళీల భర్తీ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC)లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి 5647 పోస్టులకు అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది. పదవ తరగతి, 10+2, ITI అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వివరాల ప్రకారం..
నోటిఫికేషన్ నవంబర్ 4వ తేదీన విడుదలైంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు నవంబర్ 4వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తులకు 2024 డిసెంబర్ 3 తేదీ చివరి తేదీన నిర్ణయించారు.
ఎంపిక విధానం
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా ఖాళీలను భర్తీ చేయడానికి ఎలాంటి రాత పరీక్ష లేదు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో పదవ తరగతి, 10 + 2, ఐటిఐ లో మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలను అందజేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15000 రూపాయల స్టైఫండ్ ఉంటుంది. ఇతర అలవెన్స్, బెనిఫిట్స్ ఏమి ఉండవు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వయసులోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయో సాడలింపు ఉంది.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 100 రూపాయలను ఆన్లైన్ లోఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పి డబ్ల్యు డి అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకో వచ్చును.
కావలసిన సర్టిఫికెట్లు, దరఖాస్తు ఎలా..?
పదవ తరగతి అర్హత కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్, ఐటిఐ సర్టిఫికెట్స్ ఉండాలి. కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
MOST READ :









