District collector : పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు.. మద్దతు ధర ఎంతంటే..!

District collector : పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు.. మద్దతు ధర ఎంతంటే..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
వానాకాలం పత్తి కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్ లో ఏర్పాటుచేసిన వానాకాలం పత్తి కొనుగోలు జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
ప్రభుత్వం ఈ ఏడాది పత్తి క్వింటాలుకు రూ. 7,521 మద్దతు ధర ప్రకటించిందని ఆమె తెలిపారు. తేమశాతం 12కు మించకుండా పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పత్తిని అమ్మిన తర్వాత డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా ఆధార్ తో అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
అంతకుముందు సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారిని బాలామణి మాట్లాడుతూ ఈ సారి వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 1,65,150 ఎకరాలలో రైతులు పత్తి సాగు చేశారని, అందుకుగాను 9,90,900 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
జిల్లాలో నారాయణపేట, మక్తల్ మార్కెట్లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, వాటితో పాటు జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గం లో 4, మక్తల్ నియోజకవర్గంలో 3 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని ఆమె తెలిపారు.
గతేడాది సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా 7183.55 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా, ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల ద్వారా 255574. 52 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగిందని బాలామణి వివరించారు. నవంబర్ రెండో వారంలో పత్తి విక్రయాలు జరుగుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ తెలిపారు.
అయితే పత్తి కొనుగోలుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు. జిన్నింగ్ మిల్లులలో యజమానులు ఫైర్ సేఫ్టీ యంత్రాలను ఏర్పాటు చేసుకొని అగ్నిప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, జిల్లా రవాణా అధికారి మేఘా గాంధీ, సీసీఐ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ దిలీప్ ఐ వార్, నారాయణపేట సిసిఐ అధికారి రాహుల్, స్థానిక సీఐ శివశంకర్, నారాయణపేట, మక్తల్ మార్కెట్ యార్డ్ కార్యదర్శులు భారతి, చంద్రశేఖర్, పత్తి మిల్లుల యజమానులు శ్రీనివాస్, పవన్ లాహోటీలు పాల్గొన్నారు.
LATEST UPDATE :









