Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై బావ అత్యాచారం..!

Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై బావ అత్యాచారం..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లో చందంపేట మండలంలోని చిత్రీయాల గ్రామానికి చెందిన మైనర్ బాలికపై వరుసకు బావ అయిన ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు చందంపేట ఎస్సై సతీష్ తెలిపారు.

ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి పండుగ నాడు చిత్రీయాల గ్రామానికి చెందిన మైనర్ బాలిక మిస్సింగ్ పై చందంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది.

బాధితుల ఫిర్యాదు మేరకు చందంపేట ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి విచారణ చేయగా..నిందితుడు ఆత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని రిమాండ్ కు తరలించారు. నిందితుడికి ఫోక్స్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు