Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్
BREAKING : కౌశిక్ రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి..!
BREAKING : కౌశిక్ రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి..!
హైదరాబాద్,, మన సాక్షి :
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో వచ్చిన ఆయన అనుచరులు కోడిగుడ్లు, టమాటాల తో దాడి చేశారు. కౌశిక్ రెడ్డి తన నివాసం పై బీఆర్ఎస్ జండా ఎగురవేస్తానని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అరికెపూడి గాంధీ ఆయన నివాసానికే వెళ్లారు.
కూకట్పల్లి నుంచి కొండాపూర్ లో ఉన్న కౌశిక్ రెడ్డి నివాసానికి గాంధీ తన అనుచరులతో వెళ్లారు. దాంతో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్ రెడ్డి నివాసం ఉండే చోటుకు వెళ్ళగా ఆయన అనుచరులు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు.
కౌశిక్ రెడ్డి నివాసంలోకి చొచ్చుకొని పోయిన కొంతమంది పూల కుండీలు ధ్వంసం చేశారు. ఆ తర్వాత పోలీసులు మోహరించి పలువురిని అరెస్టు చేశారు.
LATEST UPDATE :
BIG BREAKING : కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి.. రాష్ట్రంలో హై టెన్షన్..!









