Rythu Bharosa : రైతు భరోసా కోసం ఎదురుచూపు.. వచ్చేది అప్పుడేనా..!
Rythu Bharosa : రైతు భరోసా కోసం ఎదురుచూపు.. వచ్చేది అప్పుడేనా..!
పెన్ పహాడ్, మన సాక్షి :
రైతు భరోసా పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. వానా కాలం పంట సమయంలో ఎదురు చూసిన రైతులు యాసంగి వరకు వస్తుందని భావించారు. కానీ సీజన్ కూడా పూర్తయింది. నెల రోజుల్లో వారి కోతలు కూడా రానున్నాయి. అయినా కూడా రైతు భరోసా పథకం రైతులకు అందలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని జనవరి 26వ తేదీన ప్రారంభించినప్పటికీ రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాలేదు.
రైతు భరోసా అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు, రైతు భరోసా కోసం రైతుల ఎదురుచూపులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే రైతు భరోసాను 7500 ఇస్తామని చేసిన వాగ్దానం ప్రకటనకే పరిమితమై నీటి మీద మూటలుగా మారింది, యాసంగి సీసన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా నేటికి రైతుల అకౌంట్లో రైతు భరోసా జమ కాక రైతులు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు.
ఏ పథకానికి లేని అభిప్రాయ సేకరణ రైతు సంక్షేమ పథకాలకు ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంట వేసే ముందు ఇవ్వాల్సిన రైతు సాయం ఇవ్వకుండా ఆగం చేస్తున్నారని రైతు భరోసా ఇవ్వకుండా కప్పిపుచ్చుకోవడం కోసం కాలయాపన చేస్తున్నారని విమర్శలు రైతుల నుండి, సర్వత్ర రైతు సంఘం నాయకుల నుండి వినవస్తున్నాయి. కొంతమంది నాయకుల పొంతనలేని ప్రకటనలు చేయడంతో భరోసా డబ్బులు వస్తాయా రావా అని సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
సేద్యం చేసే భూమికి ఇస్తామని నేత్ర స్థాయిలో సర్వే నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగం ఎకరానికి 12,000 రూపాయలను రైతు భరోసా ద్వారా పంట సహాయం చేస్తామని ప్రకటించింది. ఒక విడత ఆరువేల రూపాయలను రైతుల ఖాతాలలో వేయనున్నట్లు ప్రకటించింది. కానీ రైతు భరోసా పథకం ప్రారంభమైన మరుసటిరోజే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున రైతు భరోసా ఆగింది.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు యుద్ధప్రాద పదికన రైతు సహాయం అకౌంట్లో జమ చేసి వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుండి రైతులను కాపాడాలని రైతులు రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.
MOST READ :









