Batti, Revanth : వైయస్సార్ జయంతి వేడుకల్లో బట్టి విక్రమార్క వ్యాఖ్యలు.. దానికి రేవంత్ రెడ్డి అలా స్పందించారు..!
Batti, Revanth : వైయస్సార్ జయంతి వేడుకల్లో బట్టి విక్రమార్క వ్యాఖ్యలు.. దానికి రేవంత్ రెడ్డి అలా స్పందించారు..!
హైదరాబాద్, మన సాక్షి :
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కార్యాలయాలతో పాటు ప్రధాన సెంటర్లలో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ క్రమంలో హైదరాబాదులోని గాంధీభవన్ లో నిర్వహించిన వైయస్సార్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తెలంగాణ ఇంచార్జ్ తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని, గ్రామాలలో కార్యకర్తలు, నాయకులు తలెత్తుకొని తిరగాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ నుంచి గతంలో వెళ్లిపోయిన నాయకులంతా తిరిగి రావాలని బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భట్టి విక్రమార్క మాట్లాడిన వ్యఖ్యలకు ఎలా స్పందించారో చూద్దాం.. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ నుంచి గతంలో వెళ్లిపోయిన వారంతా రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని బట్టి విక్రమార్క పేర్కొనడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించారు. పిసిసి అధ్యక్షుడిగా
భట్టి విక్రమార్క వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని, వెళ్లిపోయిన వారంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ALSO READ :
Good News : తెలంగాణ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఈ పథకానికి లక్షల్లో ఆర్థిక సహాయం..!









