Ration Cards : మీ రేషన్ కార్డులో పేర్ల తప్పులు, కొత్త పేర్లు యాడ్ చేయడం.. అడ్రస్ చేంజ్.. లేటెస్ట్ అప్డేట్స్..!

రేషన్ కార్డులు జారీ చేసి ఎన్నో సంవత్సరాలు గడుస్తుంది. అందులో పిల్లల పేర్లు, కొత్తగా పెళ్లయిన వారి పేర్లు యాడ్ కాలేదు. చాలామందికి అంతేకాకుండా పేర్లు కూడా తప్పులు వచ్చాయి. అవి అలాగే కొనసాగుతున్నాయి.

Ration Cards : మీ రేషన్ కార్డులో పేర్ల తప్పులు, కొత్త పేర్లు యాడ్ చేయడం.. అడ్రస్ చేంజ్.. లేటెస్ట్ అప్డేట్స్..!

మన సాక్షి, ఫీచర్స్ :

రేషన్ కార్డులు జారీ చేసి ఎన్నో సంవత్సరాలు గడుస్తుంది. అందులో పిల్లల పేర్లు, కొత్తగా పెళ్లయిన వారి పేర్లు యాడ్ కాలేదు. చాలామందికి అంతేకాకుండా పేర్లు కూడా తప్పులు వచ్చాయి. అవి అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పుడు వాటిని మార్చుకునే అవకాశం తో పాటు ఇంకా అడ్రస్ కూడా మార్చుకునే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులో తప్పులు, పేర్లలో మిస్టేక్స్, కొత్తగా పేర్లు, జమ చేయడం కు అవకాశం కల్పించింది.

ఇవన్నీ చేయడం ఇక ఈజీ ఇవి మనమే పూర్తి చేసుకోవచ్చు. కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంటే ఆన్ లైన్ మీరే ఫోన్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చును. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులు మీరు స్కాన్ చేయించి వాటిని డిజిటల్ కాపీలను మీ ఫోన్ లోకి తీసుకోవాలి. ఒక సెట్ జిరాక్స్ జిరాక్స్ కూడా తీసి ఉంచుకోవాలి. ఆ తర్వాత గూగుల్ లో తెలంగాణ మీసేవ పోర్టల్ అనే వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

ఆ వెబ్ సైట్లో హోం పేజీలో సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో సెర్చ్ ఫర్ సర్వీసెస్ అనేది కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే డిపార్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ లోకి వెళ్లి సెలెక్ట్ పైన క్లిక్ చేసి సివిల్ సప్లై అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది.

దానిలో కరెక్షన్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఆ పేజీలో కుడి వైపున డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది.

అలా డౌన్లోడ్ అయిన దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకొని ఆ ఫారం పై అడ్రస్ చేంజ్ లేదా మెంబర్స్ డీటెయిల్స్ మోడిఫికేషన్, నెంబర్ ఆడిషన్స్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. దానిలో ఏది అవసరమో దానిపై రైట్ క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ నుండి ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులను దానికి యాడ్ చేసి మీ సమీపంలోని మీ సేవ కేంద్రంలో ఇవ్వాలి.

ఇదంతా ఎందుకని ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ లను తీసుకొని మీసేవ కేంద్రానికి వెళ్లొచ్చు. అది అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మీరు కోరిన మార్పులలో రేషన్ కార్డు జారీ అవుతుంది.

ALSO READ : 

Hair Growth : జుట్టు పెరుగుదల, బట్టతల రాకుండా ఏం చేయాలి.. నేచురల్ గా పెరుగుతుంది..!

GreenTea : గ్రీన్ టీ తాగడం వల్ల ఇన్ని లాభాలా.. అవేంటో తెలుసుకుందాం..!

NALGONDA : నల్గొండ జిల్లాలో మూడు రోజులపాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం..!